IPL 2021లో విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే! మరో 269 పరుగులు చేస్తే!!

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ మరో నాలుగు రోజులో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9న ప్రారంభం అయి మే 30తో ముగుస్తుంది. ఏప్రిల్9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐపీఎల్ సందడి అభిమానుల్లో కనిపిస్తుండగా.. అది సీజన్ ఆరంభమైన తర్వాత మరింత తారాస్థాయికి చేరడం ఖాయం. ఇక ఫార్మాట్ ఏదైనా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021లో కూడా పలు రికార్డులపై కన్నేశాడు. అవేంటో ఓసారి చూద్దాం.

ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు:
ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. 2016 సీజన్‌లో 973 పరుగులు చేయడం ద్వారా సింగిల్ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డును విరాట్ లిఖించాడు. ఆ సీజన్‌లో కోహ్లీ నాలుగు సెంచరీ బాది ఆర్సీబీని ఫైనల్‌కు చేర్చాడు. ఒక సీజన్‌లో అత్యథిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (848 పరుగులు 2016 సీజన్‌లో) రెండో స్థానంలో ఉండగా.. హైదరాబాద్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (735-2018 సీజన్‌లో) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు:
ఐపీఎల్ టోర్నమెంట్‌లో ఆల్‌టైమ్ అత్యధిక పరుగులు రికార్డు కూడా విరాట్ కోహ్లీ పేరిటే ఉంది. ఇప్పటివరకూ కోహ్లీ 5878 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సురేష్ రైనా (5368), డేవిడ్ వార్నర్ (5254), రోహిత్ శర్మ (5230)లు కోహ్లీ తర్వాత ఉన్నారు. గతేడాది రైనా లీగ్ ఆడకపోవడంతో కోహ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా కోహ్లీ యావరేజ్ 46.90గా ఉంది. ఇది విరాట్ మిగతా పొజిషన్ల యావరేజ్ కంటే ఎక్కువ. మిగతా పొజిషన్లలో అతడి యావరేజ్ 34.0 మాత్రమే.

విరాట్ కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఇవే:
# టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 269 పరుగులు అవసరం.
# బెంగళూరు (చాంపియన్స్ లీగ్ టీ20, ఐపీఎల్ కలుపుకుని) తరఫున 50 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించడానికి ఇంకా నాలుగు హాఫ్ సెంచరీలు అవసరం.
# ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌ల మార్కును చేరడానికి ఇంకా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇప్పటికు వరకూ 192 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.
# ఐపీఎల్‌లో 6వేల పరుగులు చేరడానికి ఇంకా 122 పరుగులు అవసరం.
# ఐపీఎల్‌లో 50 ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించడానికి ఇంకా ఆరు హాప్ సెంచరీలు అవసరం.
# ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో 58.4 సగటుతో 409 పరుగులు చేశాడు.
# ఐపీఎల్‌లో సందీప్ శర్మ బౌలింగ్‌లో అత్యధికంగా ఏడుసార్లు ఔటయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications