Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Faf du Plesis: ఆర్సీబీ కెప్టెన్‌కి బంపరాఫర్.. మళ్లీ జాతీయ జట్టులోకి చోటు!

RCB captain Faf du Plessis to play for South Africa again

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టు సారధి ఫాఫ్ డుప్లెసిస్‌కు బంపరాఫర్ దొరికింది. సౌతాఫ్రికాకు చెందిన ఈ లెజెండరీ క్రికెటర్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. కొంతకాలంగా సౌతాఫ్రికా జట్టు ఐసీసీ టోర్నీల్లో పెద్దగా రాణించడం లేదు. అదే సమయంలో వివిధ టీ20 టోర్నీల్లో డుప్లెసిస్ అదరగొడుతున్నాడు. ఇటీవల జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా అతను చెలరేగాడు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. డుప్లెసిస్ ఇప్పటిికి కేవలం టెస్టు క్రికెట్‌కు మాత్రమే వీడ్కోలు పలికాడు. మిగతా ఫార్మాట్లలో రిటైర్‌మెంట్ ప్రకటించలేదు.

2021 ఫిబ్రవరిలో టెస్టులకు గుడ్‌బై చెప్పిన అతను.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆడేందుకు ఉత్సాహం చూపించాడు. కానీ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డులో కొన్ని వివాదాల కారణంగా అతనికి మాత్రం జాతీయ జట్టులో చోటు దక్కలేదు. తాజాగా డుప్లెసిస్ గురించి సీఎస్ఏ ఎనోచ్ క్వీ మాట్లాడుతూ.. జాతీయ జట్టులో డుప్లెసిస్‌ను తీసుకోవడంపై తను ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడు. మూడు ఫార్మాట్లలో వేరు వేరుగా సెంట్రల్ కాంట్రాక్టులు ఇవ్వాలని సీఎస్ఏ నిర్ణయించింది. ఈ క్రమంలోనే డుప్లెసిస్ మళ్లీ అంతర్జాతీయంగా ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం కనిపిస్తోంది.

RCB captain Faf du Plessis to play for South Africa again

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో డుప్లెసిస్‌కు చోటు దక్కలేదు. అయితే అతనికి త్వరలోనే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 'మా ఫ్రీలాన్స్ ఆటగాళ్లతో ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నాం. రాబ్ ఈ విషయంలో డుప్లెసిస్‌తో చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొంత మంది మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఫార్మాట్లు మాత్రమే ఆడాలని అనుకుంటున్నారు' అని సీఏ చైర్మన్ చెప్పాడు. డుప్లెసిస్ వచ్చే ఏడాది సమయంలో మళ్లీ జాతీయ జట్టుకు ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 7, 2023, 11:02 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+