Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరు ప్లేఆఫ్‌ ఆశలు గల్లంతే?

IPL 2019 : RCB Need To Win All Their Remaining Matches To Stand In The Playoffs || Oneindia Telugu
RCB can still qualify for IPL 2019 playoffs?

ఈ ఐపీఎల్‌ సీజన్‌-12లో అన్ని జట్ల కంటే ముందే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు టోర్నీ నుండి నిష్క్రమించేలా ఉంది. వరుసగా ఆరు ఓటమిల తర్వాత పంజాబ్‌తో జరిగిన ఏడవ మ్యాచ్‌లో గెలిచి తొలి విజయం నమోదు చేసింది. దీంతో విజయాల బాట పట్టుతుందనుకున్న సమయంలో.. ఎనిమిదవ మ్యాచ్‌లో మళ్లీ పరాజయంను ఎదుర్కొంది. దీంతో లీగ్‌లో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు నిరాశపరిచింది.

కనీసం 14 పాయింట్లు కావాలి:

కనీసం 14 పాయింట్లు కావాలి:

ఐపీఎల్‌ సీజన్‌-12లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటికి ఎనమిది మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒకటి గెలిచి.. ఏడు మ్యాచ్‌లలో ఓడింది. బెంగళూరు ఖాతాలో ప్రస్తుతం 2 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే 16 పాయింట్లు అవసరం. ఒకవేళ లీగ్‌లో అన్ని జట్ల మధ్య రసవత్తరపోరు జరిగినా.. ఏదైనా మ్యాచ్‌లు టై అయినా కనీసం 14 పాయింట్లు కావాలి, అదనంగా మెరుగైన రన్ రేట్ కూడా ఉండాలి.

ఓడితే దారులు మూసుకుపోయినట్టే:

ఓడితే దారులు మూసుకుపోయినట్టే:

పై గణాంకాలు అన్ని పరిగణలోకి తీసుకుంటే.. బెంగళూరుకు ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఆరు మ్యాచ్‌లలో బెంగళూరు విజయం సాదించినా.. మొత్తం 14 పాయింట్లు అవుతాయి. అలా అయినా మిగతా జట్ల ఫలితాల మీద ఆధారపడక తప్పదు. ఇక ఒక్క మ్యాచ్‌లో ఓడితే బెంగళూరు ముందుకెళ్లే దారులు మూసుకుపోయినట్టే.

అద్భుతం చేస్తే తప్ప:

అద్భుతం చేస్తే తప్ప:

బెంగళూరు వరుసగా కలకత్తా, చెన్నై, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, హైదరాబాద్ జట్లతో తలపడనుంది. భీకర ఫామ్ లో ఉన్న కలకత్తా, చెన్నై జట్లపై విజయం సాధించడం కష్టమే. మరి బెంగళూరు జట్టు ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు లేవు.

ఏడో ఓటమి:

ఏడో ఓటమి:

సోమవారం రాత్రి వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో బెంగళూరు ఖాతాలో ఏడో పరాజయం చవిచూసింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో ఛేదించింది. డికాక్‌ (40), రోహిత్‌ (28), పాండ్యా (37 నాటౌట్‌; 16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డివిలియర్స్‌, మొయిన్‌ అలీలు అర్థ సెంచరీలు చేశారు.

Story first published: Tuesday, April 16, 2019, 11:44 [IST]
Other articles published on Apr 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+