ఇద్దరు మహిళలపై అత్యాచారం ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన ఆర్సీబీ స్టార్!
ఆర్సీబీ స్టార్ పేసర్ యశ్ దయాల్ గత కొంతకాలంగా తీవ్రమైన వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడనే తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ లెఫ్టార్మ్ పేసర్.. ఐపీఎల్ 2026 సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ వివాదాలు, ఐపీఎల్‌కు దూరం కావడం, సోషల్ మీడియాలో వస్తున్న విపరీతమైన ట్రోలింగ్‌పై యశ్ దయాల్ ఎట్టకేలకు తన సుదీర్ఘ మౌనాన్ని వీడాడు. ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ విషయాలపై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ జట్టు యాజమాన్యం మీడియాతో మాట్లాడుతూ.. యశ్ దయాల్ తన వ్యక్తిగత కారణాల వల్లే ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నాడని ప్రకటించింది. అయితే దీనిపై యశ్ దయాల్ భిన్నంగా స్పందించాడు. "టీవీలో మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. నిజానికి ఆర్సీబీ నన్ను జట్టు నుంచి రిలీజ్ చేయలేదు, నన్ను రిటైన్ లిస్ట్‌లోనే ఉంచింది. నా స్థానంలో ఎలాంటి రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ను కూడా తీసుకోలేదు. బహుశా నేను జట్టుకు చాలా ముఖ్యమైన ఆటగాడినని వారు భావించి ఉండవచ్చు" అని యశ్ దయాల్ పేర్కొన్నాడు.

ఈ సీజన్ నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదని చెప్తూ యశ్ దయాల్ ఓ వివాదాస్పద కామెంట్ చేశాడు. "నేను టోర్నీకి దూరం కావడం నా సొంత నిర్ణయం కాదు. ఇది వినడానికి కాస్త వివాదాస్పదంగా అనిపించవచ్చు. కానీ ఇలాంటి పెద్ద నిర్ణయాలు ఎప్పుడూ జట్టు యాజమాన్యమే తీసుకుంటుంది. కావున నన్ను ఎందుకు ఆడించలేదనే దానికి అసలు కారణం నాకు తెలియదు. దీని గురించి ఎక్కువ మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ నేను నా టీమ్‌ను చాలా మిస్సవుతున్నాను. నేను ఉండాల్సిన చోటు అది" అని యశ్ దయాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఆర్సీబీ యాజమాన్యంతో తనకు ఎల్లప్పుడు కమ్యూనికేషన్ ఉందని.. ఇటీవల ఆర్సీబీ మెంటార్ దినేష్ కార్తీక్‌తో కూడా మాట్లాడానని స్పష్టం చేశాడు.
ఇలాంటి ఘోరమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పుడు సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీని ఎలా తట్టుకున్నారనే ప్రశ్నపై యశ్ దయాల్ స్పందించాడు. యశ్ దయాల్ మాట్లాడుతూ.. "గడిచిన ఏడాది కాలంగా నేను తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించాను. ఊహించని సంఘటనలు జరిగినప్పుడు మనపై మనకే నమ్మకం పోతుంది. చాలా రోజులు డిప్రెషన్‌కు లోనయ్యాను, నిద్రలేని రాత్రులు గడిపాను. మన వల్ల ఇల్లంతా బాధపడుతుంటే ఎలా నిద్ర పడుతుంది? మన వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో చర్చించినప్పుడు పరిస్థితి చాలా నరకంగా మారుతుంది. కానీ ఒకటి నిజం.. మనం కరెక్టో కాదో తెలిసినప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు వాగే మాటలను అస్సలు పట్టించుకోకూడదు" అని చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌పై ఉన్న కేసులు ఇవే..
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళను ఐదేళ్లపాటు లైంగికంగా వేధించినట్లు యశ్ దయాల్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు అతని అరెస్టుపై స్టే విధించింది. యశ్ దయాల్ తరఫు న్యాయవాదులు ఇది ఇష్టపూర్వకంగా జరిగిన బంధమని, డబ్బు వసూలు చేయడానికి, అతని ప్రతిష్టను దెబ్బతీయడానికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని వాదించారు.
ఇక రెండో కేసు అత్యంత తీవ్రమైనది. ఓ మైనర్ బాలికను రెండున్నరేళ్ల పాటు లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై యశ్ దయాల్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో యశ్ దయాల్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. స్పెషల్ పోక్సో కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత మధ్యంతర ఉపశమనం కోసం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. ప్రస్తుతం ఈ రెండు కేసులు కోర్టు పరిధిలోనే పెండింగ్‌లో ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications