Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

21 ఏళ్ల కుర్రాడి ఊచకోత.. 9వ స్థానంలో వచ్చి 9 సిక్సులు

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ జట్టుతో జరగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ 21 ఏళ్ల ఆల్‌రౌండర్ రజావుల్లా ఖాన్ తన అద్భుతమైన అరంగేట్రంతో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. క్లిష్ట పరిస్థితుల్లో మైదానంలోకి అడుగుపెట్టిన ఈ యువ ఆటగాడి దూకుడు వైఖరి మ్యాచ్‌నే మలుపు తిప్పడమే కాకుండా పాకిస్థాన్‌ను ఘోరమైన ఇన్నింగ్స్ ఓటమి నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషించాడు.

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

అదే మా కొంపముంచింది.. కన్నీళ్లు పెట్టుకున్న పాక్ కెప్టెన్!

63 బంతుల్లో 81 పరుగులు భీకర ఇన్నింగ్స్
మ్యాచ్ నాలుగో రోజున పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ పతనానికి చేరువవుతున్న సమయంలో రజావుల్లా ఖాన్ స్టేడియంలోకి వచ్చి సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 63 బంతుల్లోనే 81 పరుగులు సాధించి మ్యాచ్‌కు కొత్త జీవం పోశాడు. ఈ తుఫాన్ ఇన్నింగ్స్‌లో 9 భారీ సిక్సర్లు బాది ఇంగ్లాండ్ బౌలర్లను తీవ్రంగా దెబ్బతీశాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా మొదటి ఇన్నింగ్స్‌లో తన కుడిచేతి ఫాస్ట్ బౌలింగ్‌తో 4 కీలక వికెట్లు తీసి అత్యుత్తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు.

Razaullah Khan Test Debut 21-Year-Old Pakistan All-Rounder Equals World Record smashing 9 sixes

9వ వికెట్‌కు శతక భాగస్వామ్యం
ఓటమి అంచున ఉన్న పాకిస్తాన్ జట్టును గట్టెక్కించేందుకు రజావుల్లా ఖాన్, సీనియర్ బౌలర్ మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి 9వ వికెట్‌కు విలువైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి డాన్ లారెన్స్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యేంత వరకు పోరాడిన రజావుల్లా.. ఇంగ్లాండ్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.

149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ప్రపంచ రికార్డు సమం
తన మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనే 9 సిక్సర్లు కొట్టడం ద్వారా 149 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రజావుల్లా ఖాన్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. విశేషమేమిటంటే.. 2008లో ఇంగ్లాండ్ పైనే 9 సిక్సర్లతో ఈ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ.. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్ గా డగౌట్లో ఉంటూ ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించాడు.

IND vs AFG: బ్యాటింగ్ కాంబినేషన్ తలనొప్పే.. తిలక్ వర్మ‌ను ఏ స్థానంలో ఆడిస్తారు: ఏబీ డివిలియర్స్

Also Read

IND vs AFG: బ్యాటింగ్ కాంబినేషన్ తలనొప్పే.. తిలక్ వర్మ‌ను ఏ స్థానంలో ఆడిస్తారు: ఏబీ డివిలియర్స్

అరంగేట్ర టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
*టిమ్ సౌథీ(న్యూజిలాండ్)-9 సిక్సర్లు
*రజావుల్లా(పాకిస్తాన్)-9 సిక్సర్లు
*కైల్ మేయర్స్(వెస్టిండీస్)-7 సిక్సర్లు
*గోర్డాన్ గ్రీనిడ్జ్(వెస్టిండీస్)-5 సిక్సర్లు

కఠినమైన ఇంగ్లాండ్ పరిస్థితులలో అరంగేట్రంలోనే 4 వికెట్లు తీసి బ్యాట్ తో 81 పరుగులు సాధించడం ఏ యువ ఆటగాడికైనా ఓ డ్రీమ్ అరంగేట్రం అని చెప్పవచ్చు. ఈ ప్రదర్శన ద్వారా పాకిస్తాన్ క్రికెట్ కు సుదీర్ఘకాలం ఉపయోగపడే ఓ అద్భుతమైన ఆల్ రౌండర్ దొరికినట్లు తెలుస్తోంది.

Story first published: Saturday, September 12, 2026, 10:29 [IST]
Other articles published on Sep 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+