Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హెచ్‌సీఏ సఫలం: హైదరాబాద్‌కు వచ్చిన రాయుడు, ఓజా

హైదరాబాద్: గతేడాది వరకు రంజీల్లో హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉన్న అంబటి రాయుడు, ప్రజ్ఞాన్‌ ఓజా తిరిగి జట్టులోకి తీసుకురావడంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. గతంలో ఉన్న సభ్యులతో విభేదాల కారణంగా వీరిద్దరూ హెచ్‌సీఏని వీరిద్దరూ వీడిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు హైదరాబాద్‌ జట్టు కోసం ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు జులై 24 నుంచి ఆగస్ట్‌ 2 వరకు జరగనున్నాయి.

Rayudu to lead Hyderabad, Ojha set to return

ఈ మ్యాచ్ కోసం హెచ్‌సీఏ బుధవారం హైదరాబాద్ జట్టుని ప్రకటించింది. ఈ జట్టులో అంబటి రాయుడు, ప్రజ్ఞాన్‌ ఓజా కూడా ఉన్నారు. అంతకముందు అంబటి రాయుడు ఆంధ్ర, బరోడా, విదర్భ జట్ల తరఫున ఆడగా, ఓజా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ ఆసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) కూడా ఓజాకు ఎన్ఓసి ఇచ్చింది.

జట్టు: అంబటి రాయుడు, అక్షత్‌ రెడ్డి, బి. సందీప్, తన్మయ్‌ అగర్వాల్, ఠాకూర్‌ తిలక్‌వర్మ, ఆకాశ్‌ భండారి, ప్రజ్ఞాన్‌ ఓజా, సీవీ మిలింద్, రవికిరణ్, కె.సుమంత్, మెహదీ హసన్, ఆశిష్‌ రెడ్డి, విశాల్‌ శర్మ, రోహిత్‌ రా యుడు, ముదస్సిర్‌ హుస్సేన్‌. స్టాండ్‌ బైస్‌: పి.రోహిత్‌ రెడ్డి, శ్రవణ్‌ కుమార్, కోచ్‌: అర్జున్‌ యాదవ్‌.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+