జింబాబ్వే ఆటగాళ్లను బెదిరించారు: 'రా'పై పాక్ మంత్రి
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ మంత్రి షూజా ఖాన్ జాదా భారత్ పైన తీవ్ర ఆరోపణలు చేశారు. జింబాబ్వే జట్టును పాకిస్తాన్‌లో పర్యటించకుండా అడ్డుకునేందుకు భారత్‌కు చెందిన నిఘా సంస్థ 'రా' ప్రయత్నాలు చేసిందని ఆరోపించాడు.
లాహోర్‌లోని పంజాబ్ అసెంబ్లీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పర్యటనకు బయలుదేరిన జింబాబ్వే జట్టు దుబాయ్‌లో అడుగు పెట్టే సమయంలో ఆ జట్టు మేనేజర్‌కు 'రా' ఓ సందేశం పంపించిందని, ఆటగాళ్లు లాహోర్ వెళ్తే వారిలో ఏ ఒక్కరు తిరిగి ప్రాణాలతో తిరిగి వెళ్లలేరని చెప్పిందని ఆరోపించాడు.

జింబాబ్వే జట్టు మేనేజర్ ఆ సందేశాన్ని తమకు ఫార్వార్డ్ చేయడంతో విషయం తెలిసిందని చెప్పాడు. దానిని పరిశీలించగా 'రా' అధికారి నుండి వచ్చినట్టు తెలిసిందని ఆరోపించాడు. జింబాబ్వే పర్యటనపై వారు ఎత్తుగడ వేస్తే తాము తిప్పికొట్టామన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications