Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఆసీస్ లెజెండ్‌కు చురకలేసిన మాజీ కోచ్.. నవ్వుకుంటున్న ఫ్యాన్స్!

Ravishastri trolls Australia legend in commentory box

ఆస్ట్రేలియా, భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోందంటే మైదానంలోనే కాదు.. మైదానం బయట కూడా మాటల తూటాలు పేలుతుంటాయి. తాజాగా నాగ్‌పూర్ టెస్టులో కూడా అదే జరిగింది.

భారత జట్టు తొలి రోజు బ్యాటింగ్ చేసే సమయంలో ఆసీస్ లెజెండ్ మార్క్ వా, రవిశాస్త్రి, దినేష్ కార్తీక్ కామెంటరీ బాక్సులో ఉన్నారు. ఈ సమయంలోనే ఏ జట్టు బౌలర్లకు ఎంత స్పిన్ దక్కిందనే గణాంకాలు చూపించారు.

స్పిన్ విషయంలో ట్రోలింగ్..

స్పిన్ విషయంలో ట్రోలింగ్..

భారత స్పిన్నర్ల కన్నా కూడా ఆసీస్ స్పిన్నర్లకు ఎక్కువ స్పిన్ లభించినట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. ఇది చూసిన మార్క్ వా.. 'ఇదిగో స్పిన్‌లో భారత బౌలర్లను మా వాళ్లు ఓడించేశారు' అన్నాడు. అది విన్న రవిశాస్త్రి.. 'కానీ పడగొట్టిన వికెట్లు మాత్రం సున్నా' అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీంతో మార్క్ వాకు ఎక్కడో కాలింది. ఆ తర్వాత కాసేపు సైలెంట్‌గా ఉన్న వాళ్లు సిరీస్ ఎవరు గెలుస్తారని అంచాలు వేశారు.

అప్పుడేం అన్నావ్?

అప్పుడేం అన్నావ్?

ఈ విషయంలో కూడా మార్క్ వాకు రవిశాస్త్రి చురకలు వేశాడు. 'అంచనాల గురించి మాట్లాడుతుంటే.. నాకు మార్క్ చెప్పిన ఒక జోస్యం గుర్తొస్తోంది. భారత జట్టు 36 పరుగులకు ఆలౌట్ అవడం చూసి.. ఆ సిరీస్‌ను ఏకంగా 4-0తో ఆస్ట్రేలియా గెలుస్తుందని మార్క్ చెప్పాడు' అని గుర్తుచేశాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఆ సిరీస్‌ను భారత్ గెలిచింది. దీంతో 'అవునా? నేను అలా చెప్పినట్లు అసలు గుర్తే లేదే నాకు?' అంటూ మార్క్ వా తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

కోహ్లీపై కామెంట్స్..

కోహ్లీపై కామెంట్స్..

అంతకుముందు టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీని మార్క్ వా టార్గెట్ చేశాడు. భారత జట్టు టెస్టులు ఆడే విధానాన్ని కోహ్లీ మార్చేశాడని మెచ్చుకున్న అతను.. స్లిప్స్‌లో మాత్రం కోహ్లీ పనికిరాడనే విధంగా కామెంట్స్ చేశాడు. 'బంతి తన వైపు వస్తుందని కోహ్లీ అనుకున్నట్లే కనిపించడం లేదు. ఆటపై దృష్టి ఉంచడం లేదు. స్లిప్ ఫీల్డింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు లేడు. అతని రిఫ్లెక్స్‌లు కూడా నెమ్మదిగా ఉన్నాయి' అని విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ నేలపాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మార్క్ వా ఈ కామెంట్స్ చేశాడు.

Story first published: Friday, February 10, 2023, 10:24 [IST]
Other articles published on Feb 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+