For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ కోసం తన ప్లేయింగ్ 11 టీంలో దినేష్ కార్తీక్‌ను పట్టించుకోని రవిశాస్త్రి

 Ravishastri picks Teamindia playing 11 for 1st T20 against Southafrica

జూన్ 9న న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 కోసం టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి.. తన టీమిండియా ప్లేయింగ్ 11ని ప్రకటించాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన వెంకటేష్ అయ్యర్‌ను తన స్క్వాడ్‌లో రవిశాస్త్రి పేర్కొనలేదు. అలాగే ఈ మధ్య భీకర ఫామ్‌లో ఉన్న దినేష్ కార్తీక్‌ను కూడా ప్లేయింగ్ 11కు తీసుకోలేదు. ఇక కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌లను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. ఆశ్చర్యకరంగా ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా మాత్రం శాస్త్రి ఎంచుకోలేదు.

ఇకపోతే గుజరాత్ టైటాన్స్‌‌కు అరంగేట్రంలోనే ఐపీఎల్ ట్రోఫీ ఇచ్చిన హార్దిక్ పాండ్యా.. ప్లేయింగ్ 11లో కీలకమైన ప్లేయర్‌గా రవిశాస్త్రి పేర్కొన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు చాలా ఉపయోగపడే ప్లేయర్ అవుతాడని పేర్కొన్నాడు. ఇకపోతే ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే ప్లేయర్‌గా పేర్కొన్నాడు. ఇక 4వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను, అయిదో స్థానంలో రిషబ్ పంత్‌ను, ఆరో స్థానంలో హార్దిక్ పాండ్యాను రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇకపోతే బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్‌లను రవిశాస్త్రి ఎంచుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ మరియు ఉమ్రాన్ మాలిక్ మధ్య ఎవరినైనా ఒకరిని తీసుకోవాలని ప్రస్తావించాడు. ఇక మీడియం పేసర్ మరియు స్పెషలిస్టు బౌలర్‌గా హర్షల్ పటేల్‌ను ఎంచుకున్నాడు.

రవిశాస్త్రి ప్రకటించిన ప్లేయింగ్ XI: కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్/ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్.

Story first published: Sunday, June 5, 2022, 19:50 [IST]
Other articles published on Jun 5, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+