For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ టైంలో ఆగమాగం చేసిన రవిశాస్త్రి.. బాబర్ ఆజామ్ ఒకటంటే శాస్త్రి మరొకటి చెబుతూ కామెంట్రీ

Ravishastri Confused at Toss Time He says Heads is the Call but Actual Call is Tail

ఆసియాకప్ 2022లో భాగంగా భారత్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, తేమ ప్రభావం తదితర కారణాల వల్ల తాను బౌలింగ్ ఎంచుకుంటున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. ఒక్క మార్పుతో పాకిస్థాన్ జట్టు బరిలోకి దిగింది. గాయంతో షానవాజ్ దహనీ దూరమవ్వగా అతని స్థానంలో హసన్ అలీ జట్టులోకి వచ్చాడు. ఇకపోతే టీమిండియా సారథి రోహిత్ శర్మ జట్టులో మూడు మార్పులు జరిగినట్లు తెలిపాడు. హాంకాంగ్ మ్యాచ్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వగా.. దీపక్ హుడా, రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.

ఇకపోతే టాస్ టైంలో విచిత్రకరమైన సన్నివేశం జరిగింది. టాస్ సమయంలో ప్రజెంటేటర్‌గా వ్యవహరించిన రవిశాస్త్రి ఓ పొరపాటు చేశాడు. టాస్ కాయిన్ అందుకున్న రోహిత్ కాయిన్‌ను గాల్లోకి ఎగురవేయగా.. బాబర్ ఆజామ్ టెయిల్స్ అంటూ తన ఆప్షన్ చెప్పాడు. అయితే పొరపాటు పడ్డ రవిశాస్త్రి.. హెడ్స్ ఇజ్ ది కాల్ అంటూ పేర్కొన్నాడు. అయితే టాస్ మాత్రం టెయిల్స్ అని రావడంతో అసలు టాస్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇంతకీ టెయిల్సా హెడ్సా అనేది కాసేపు ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యాడు. బాబర్ ఆజామ్ టాస్ అని చెప్పడం మైక్ లేకుండా చెప్పడంతో అతని వాయిస్ విన్పించలేదు. ఇక మైక్‌తో రవిశాస్త్రి తనదైన స్టైల్లో బిగ్గరగా చెప్పడంతో హెడ్స్ ఇజ్ ది కాల్ అనేది గట్టిగా వినిపించింది. ఇక తీరా టెయిల్ రావడం.. బాబర్ ఆజామ్ టాస్ గెలిచినట్లు పేర్కొనడంతో అతను బౌలింగ్ ఎంచుకోవడం జరిగిపోయాయి. అయితే రవిశాస్త్రి ఎక్సయిటింగ్‌గా ఫీలయ్యి హెడ్స్ అని పేర్కొన్నట్లు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఈ వీడియో నెట్టింటా ట్రెండయ్యింది. టాస్, రవిశాస్త్రి పేర్లతో ఈ విషయం ట్రెండ్ అయింది.

తుది జట్లు:
భారత్: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌‌), కేఎల్ రాహుల్‌‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దీపక్ హుడా, భువనేశ్వర్‌‌, అర్ష్‌‌దీప్‌‌, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్‌‌.
పాకిస్తాన్‌‌: బాబర్‌ ఆజామ్ ‌(కెప్టెన్‌‌), మహమ్మద్ రిజ్వాన్‌‌ (వికెట్ కీపర్‌‌), ఫాఖర్ జమాన్‌‌, ఇఫ్తికర్‌‌, కుష్దిల్‌‌ షా, షాదాబ్‌‌ ఖాన్, ఆసిఫ్‌‌, నవాజ్‌‌, నసీమ్‌‌, హరీస్ రవూఫ్‌‌, హసన్‌‌ అలీ

Story first published: Sunday, September 4, 2022, 20:09 [IST]
Other articles published on Sep 4, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+