Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravindra Jadeja video viral: అన్న స్టెప్పేస్తే మాస్..!

రవీంద్ర జడేజా...టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్. బంతితోనే కాదు బ్యాట్‌తో కూడా సత్తాచాటగలిగే వారు టీమిండియాలో ఎవరైనా ఉన్నారా అంటే అది సర్ రవీంద్ర జడేజా మాత్రమే అని చెప్పొచ్చు. ఇప్పుడు రవీంద్ర జడేజా ప్రస్తావన అని ఎందుకనుకుంటున్నారా..అక్కడికే వస్తున్నాం. ఎప్పుడూ గ్రౌండ్‌లో చురుగ్గా కనిపించే ఈ ఆల్‌రౌండర్ ఇప్పుడు తనలోని మరో టాలెంట్‌ను వెలికి తీశాడు.ఇంతకీ ఏంటనుకుంటున్నారా..

రవీంద్ర జడేజా ప్రస్తుతం క్రికెట్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి కుటుంబంతో కలిసి ఎంచక్కా అమెరికాను చుట్టేస్తున్నాడు. వరల్డ్ కప్‌ ఉన్న నేపథ్యంలో అంతకుముందే ఒక స్మాల్ ట్రిప్ వేయాలని భావించి అమెరికాకు కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడ జడ్డూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఐపీఎల్ ఫ్రాంఛెజీ చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అమెరికా వీధుల్లో జడ్డూ భాయ్ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను షేర్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్.

Ravindra Jadejas Dance Delight: Fans Envision Thala Joining the Groove

ఇక రవీంద్ర జడేజా ఏ పాటకు స్టెప్పులేశారో తెలిస్తే వావ్ అంటారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరుగాంచిన ప్రభుదేవ చిత్రంలోని ముక్కాల ముక్కాబులా అనే సాంగ్‌కు రవీంద్ర జడేజా స్టెప్పులు వేసి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాడు. ఈ డ్యాన్స్ చూసిన ఫ్యాన్స్ ఇతర నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ రాసుకొస్తున్నారు. ఇదే సాంగ్‌లో జడ్డూతో పాటు ధోనీ కూడా ఉంటే ఆ కిక్కే వేరప్పా అంటూ ఒకరు పోస్టు చేయగా .. మరొకరు ఈ ఏడాదిలో రవీంద్ర జడేజా అంతటి హ్యాపీ గోయింగ్ పర్సన్ మరొకరు లేరంటూ కామెంట్ చేశారు. మరొకరైతే తనను సెలెక్ట్ చేయకపోవడంతో భారత్ వెస్టిండీస్‌పై ఓటమి చూసిందన్న సంతోషంతో జడేజా డ్యాన్స్ చేస్తున్నారంటూ కామెంట్ చేశారు.

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం కపిల్ దేవ్ చేసిన ఘాటు వ్యాఖ్యలపై జడేజా స్పందించాడు. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అసహనం ఎక్కువగా ఉంటోందంటూ కపిల్ చేసిన వ్యాఖ్యలపై అలాంటిదేమీ లేదని ప్రతి ఒక్కరూ క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తున్నారంటూ జడేజా కౌంటర్ ఇచ్చాడు. ఆటగాళ్లకు జట్టులో స్థానం లభించిందంటే వారి సర్వస్వం ఆటకోసం ధారపోస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. ఎవరూ ఈజీగా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించాడు.

Story first published: Tuesday, August 8, 2023, 12:09 [IST]
Other articles published on Aug 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+