Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS AUS: 'భారత్ - పాక్ తర్వాత ఇదే అసలైన మజానిస్తుంది' - జడేజా అందాల భార్య

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఆసీస్ - భారత్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి ఫైనలిస్ట్ కు చేరుకోవాలని భారత క్రికెట్ అభిమానులంతా బలంగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా కూడా భారత జట్టుకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఆస్ట్రేలియాపై భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

కచ్చితంగా గెలుస్తాం..
"కచ్చితంగా ఈ సెమీఫైనల్ మ్యాచ్ గెలవబోతున్నాం. భారత్ - పాక్ మ్యాచ్ తర్వాత క్రికెట్ లో ఆసక్తికరమైన పోరు భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఉంటుంది. గత కొన్నేళ్లుగా భారత్ - ఆసీస్ మధ్య పోరు ఎంత థ్రిల్లింగ్ గా ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. అయినా నేనొక్కదాన్నే కాదు, భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఈ సెమీఫైనల్ ను అధిగమిస్తాం అనే ధీమాతోనే ఉన్నారు. నా తరఫున, ఈ ప్రపంచంలోని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ తరఫున టీమిండియాకు ఆల్ ది బెస్ట్." అని రివాబా జడేజా చెప్పుకొచ్చింది.

Ravindra jadeja wife rivaba wishes for teamindia on ind vs aus semifinal champions trophy 2025

అదే ఫార్ములాతో బరిలోకి దిగాలని..
ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే దుబాయ్‌ పిచ్‌ స్పిన్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌కు అప్లై చేసిన ఫార్మూలానే ఈ సెమీస్ మ్యాచ్ కు ఉపయోగించాలని మాజీలు సూచిస్తున్నారు. కివీస్ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లతో ఆడి ఘన విజయం సాధించింది భారత్. అందుకే ఇప్పుడు ఆసీస్ మ్యాచ్ లోనూ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని అంటున్నారు.

Story first published: Tuesday, March 4, 2025, 12:35 [IST]
Other articles published on Mar 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+