
సర్ అంటేనే మంట..
'నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. సర్ అని పిలిస్తే నాకు అస్సలు నచ్చదు. కావాలంటే బాపూ అని పిలవడం. నన్ను మా ఊళ్లో అలాగే పిలుస్తారు. అది నాకు ఓకే. అంతేకానీ ఈ సార్, వార్ అని పిలిస్తే నాకు చిరాకు. మా దగ్గర ఒకరినొకరు గౌరవంగా మీరు లేదా బాపూ అని పిలుచుకుంటారు. నాకదే ఇష్టం' అని జడ్డూ తేల్చేశాడు. జడ్డూ అద్భుతంగా ఆడుతున్న సమయంలో మాజీ కెప్టెన్ ధోనీ పెట్టడంతో ఈ 'సర్' పదం అతని పేరుకు చేరింది. అప్పటి నుంచి అతన్ని అభిమానులు 'సర్ రవీంద్ జడేజా' అని పిలవడం అలవాటు చేసుకున్నారు.

ఎంతో ట్రోలింగ్ చేశారు..
ప్రస్తుతం టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా ఉన్న జడేజా.. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా పెదవివిప్పాడు. ఒకానొక సమయంలో జడ్డూ అంత గొప్ప ఫామ్‌లో లేడు. దీంతో అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ సమయంలోనే ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన విమర్శల వల్ల.. జడ్డూ, మంజ్రేకర్ మధ్య సోషల్ మీడియాలో వాగ్వాదం కూడా జరిగింది. దీనిపై మాట్లాడిన జడ్డూ.. 'నేను సరిగా ఆడనప్పుడు చాలా మంది ట్రోలింగ్ మొదలు పెడతారు. తిట్టిపోస్తారు. నేను ఎంత కష్టపడి ఇంత దూరం వచ్చానో వాళ్లకు తెలీదు. ఎన్నో కష్టాలు, త్యాగాలు చేస్తేనే ఇక్కడి వరకు వచ్చా' అని వెల్లడించాడు.

కాలంతో మారతాం..
సాధారణంగానే మనల్ని అందరూ జడ్జ్ చేయడానికి చూస్తారని జడ్డూ అన్నాడు. తను సరిగా ఆడనప్పుడు 'ఇక వీడింతే.. వీడు జీవితంలో మెరుగవ్వడు. వాడు ఒక స్టేజ్ దాటి ఎదగలేడు' అంటూ విమర్శించేవారని గుర్తుచేసుకున్నాడు. 'వీళ్లందరికీ అర్థం కాని విషయం ఏంటంటే.. కాలం గడిచేకొద్దీ ప్రతి ఒక్కరూ మెరగవుతారు. రేస్ మొదలైనప్పుడు, ముగించేటప్పుడు ఆటగాడు ఒకేలా ఉండడు. ఈ చిన్న విషయం వాళ్లకు అర్థం కాదు' అన్నాడు. కెరీర్ మొదలైనప్పుడు తను చాలా వరస్ట్ ఆటగాడినని, కానీ సమయం గడిచేకొద్దీ మెరుగవుతానని చెప్పాడు. తను మెరుగైన తర్వాత అందరి అభిప్రాయాలు మారతాయని, ఒకప్పుడు వేస్ట్ అన్నవాళ్లే.. భారత్‌కు కావలసింది ఇలాంటి ఆల్‌రౌండరే అని మెచ్చుకుంటారని చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
