Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : అలా పట్టేశాడేంట్రా?.. జడేజా స్టన్నింగ్ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్!

Ravindra Jadeja takes a stunning catch in INDvsAUS first ODI

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ జడేజా సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. రెండో ఓవర్లోనే మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) కీలక వికెట్ తీసుకున్నాడు. ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్ (5)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ (22), మిచెల్ మార్ష్ (81) ఇద్దరూ చక్కగా ఆడారు. స్మిత్ అవుటైన తర్వాత వచ్చిన లబుషేన్ (15) కూడా చక్కని టచ్‌లో కనిపించాడు.

లబుషేన్, మార్ష్ జోడీ ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను భుజాలపై వేసుకుంది. ఈ జోడీని జడేజా విడగొట్టాడు. జడ్డూ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన మార్ష్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు వచ్చాడు. టచ్‌లో కనిపిస్తున్న లబుషేన్‌.. కుల్దీప్ (Kuldeep Yadav) వేసిన బంతిని వెనకడుగు వేసి కట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ చేతులు ఫ్రీగా కదిలించేంత రూమ్ లేకపోవడంతో అతను తడబడ్డాడు. దీంతో గాల్లోకి లేచిన బంతి షార్ట్ థర్డ్‌లో ఉన్న జడేజా కుడివైపుగా వెళ్లింది.

జడ్డూ ఎంత మంచి ఫీల్డరో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటి ఆటగాడు తనవైపు వచ్చిన బంతిని ఎందుకు వదులుతాడు. చిరుతలా ఆ బంతి మీదకు దూకాడు. బంతి నేలను తాకడానికి సెంటీమీటరు దూరంలో రెండు చేతులతో దాన్ని పట్టేశాడు. ఈ క్యాచ్ చూసిన కుల్దీప్ యాదవ్ సహా టీమిండియా అంతా ఆశ్చర్యపోయింది. ప్రేక్షకులు కూడా జడ్డూ (Ravindra Jadeja) ఫీల్డింగ్‌కు షాకైపోయి నోరెళ్లబెట్టారు. ఇది జెన్యూన్ క్యాచ్ అని రిప్లేలో తేలడంతో లబుషేన్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా జట్టు 188 పరుగులకే ఆలౌట్ అయింది.

Story first published: Friday, March 17, 2023, 17:10 [IST]
Other articles published on Mar 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+