Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లంటూ కోహ్లీ, ఇల్లంటూ జడేజా ఒకరు తరువాత మరొకరు..

Ravindra Jadeja Swanky 'Cricket Bungalow' Coming up Soon

హైదరాబాద్: కోహ్లీ తనకు 48 నెలల నుంచి విరామం ఉండట్లేదని శరీరం బాగా అలసిపోయిందని సెలవు తీసుకున్నాడు. అది అబద్ధమే అయినా తను మాత్రం సెలవు తీసుకుని పెళ్లి చేసుకున్న మాట వాస్తవమే. మొన్న జరిగిన భారత్ శ్రీలంక టెస్టు సిరీస్ అనంతరం కోహ్లీ పెళ్లికి వెళ్లిపోతే ఇంకో క్రికెటర్ ఇంటికి వెళ్లాడు. ఇంటికి కాదు కొత్తగా కట్టబోయే ఇంటికి, తాను ఓ కొత్త ఇల్లు కట్టుకుంటున్నాడంట. అందుకునే సెలవు పెట్టానని తనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు.

శ్రీలంకతో టెస్టు సరిరీస్ ఆడిన తర్వాత భారత క్రికెటర్ రవీంద్ర జడేజా బాగా బిజీ అయిపోయాడు. తన సొంత ఇంటి కల నెరవేర్చుకోవడంలో బిజీ బిజీ అంటున్నాడు మన ఆల్‌రౌండర్. ఆ ఇంటికి ఓ ముద్దు పేరు పెట్టుకుని అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలంటూ సెలవుపై గుజరాత్‌లోని జామ్ నగర్‌కు వెళ్లినట్లు సమాచారం. తన ఇంటి పేరు 'క్రికెట్ బంగ్లా' అని నామకరణం చేశాడు. దానిని తన ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఉంచి "క్రికెట్ బంగ్లా సిద్దమౌతుంది. స్వీట్ హోమ్" అని పోస్ట్ చేశాడు.

ఇటీవల జరిగిన శ్రీలంక టెస్టు సిరీస్‌లో రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. తను ఆడిన 35 టెస్టుల్లో 165వికెట్లు తీశాడు. తన ఖాతాలో 1176పరుగులు ఉన్నాయి. దక్షిణాఫ్రికా టూర్‌కు ఎంపికైన జడేజా జనవరిలో అందుబాటులోకి రానున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 19, 2017, 13:06 [IST]
Other articles published on Dec 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+