
హైదరాబాద్: ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేదం తర్వాత పునరాగమనం చేస్తున్న చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన దిగ్గజ ఆటగాళ్లైన మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలను అట్టిపెట్టుకొని అభిమానులకు శుభవార్తను అందించింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన అనంతరం రైనా, జడేజా, ధోనిలు కాంట్రాక్ట్ ఒప్పందాలు సంతకం చేస్తున్న వీడియోలను సీఎస్‌కే అభిమానులతో పంచుకుంది.
తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా వారి భావాలను క్రికెటర్లు వీడియోల్లో వ్యక్తం చేశారు. వణక్కమ్ చెన్నై అంటూ రైనా, విజిల్ పొడు అని జడేజా అభిమానులకు తమ సందేశాన్నిచ్చారు. ఇక ధోని ఒప్పంద పత్రాలపై సంతక చేస్తున్న సమయంలో అతని కూతురు జీవా పక్కనే ఆడుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ధోనీ:
సురేశ్ రైనా:
వణక్కమ్ చెన్నై! సీఎస్‌కే పునరాగమనం సంతోషంగా ఉంది. గత రెండేళ్లుగా కోల్పోయిన ఆటను మీ ముందు ఆడటానికి ఉవ్విళ్లూరుతున్నాను. చెపాక్ స్టేడియంలో మిమ్మల్ని కలవడానికి ఉత్సాహంగా ఉన్నాను.
రవీంద్ర జడేజా
హాయ్ గాయ్స్! నేను సీఎస్‌కేలో మళ్లీ భాగమైనందుకు చాలా ఉత్సహంగా, సంతోషంగా ఉన్నాను. మా ఆటను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. మేం చాలా మ్యాచ్‌లు గెలవడానికి ప్రయత్నిస్తాం. విజిల్ పొడు.
ధోని నాయకత్వంలో సీఎస్‌కే రెండు సార్లు ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేగాకుండా 2010 చాంపియన్స్ లీగ్ టైటిల్ సైతం నెగ్గింది.
పంజాబ్ జట్టు:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అక్షర్ పటేల్‌ను ఒక్కరినే అట్టిపెట్టుకోంది. ఈ యువ క్రికెటర్ సైతం ట్విట్టర్ వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.