Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టు నన్ను నమ్మడం లేదు: రవీంద్ర జడేజా షాకింగ్ కామెంట్స్!

టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింటిలోనూ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ తన కెరీర్లో అర్హతకు తగ్గట్టుగా బ్యాటింగ్ అవకాశాలు లభించలేదని రవీంద్ర జడేజా అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా వర్షం వల్ల ఆట నిలిచిపోయిన సమయంలో బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతూ.. తన బ్యాటింగ్ స్థానం, ఎదుర్కొన్న నిరాశ గురించి సంచలన విషయాలను పంచుకున్నాడు.

భారత్ బోణీ.. పాక్ బోల్తా!

భారత్ బోణీ.. పాక్ బోల్తా!

తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తాను నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్ చేసేవాడనని రవీంద్ర జడేజా వెల్లడించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటు ఉన్నందున తన బ్యాటింగ్ సామర్థ్యంపై తనకు సంపూర్ణ నమ్మకం ఉండేదని జడేజా చెప్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చినప్పుడు ఆ స్థానం లభించలేదని.. జట్టు యాజమాన్యం తనను నంబర్ 8 లేదా 9 స్థానాల్లో బ్యాటింగ్‌కు పంపడం తీవ్రంగా నిరాశపరిచిందని పేర్కొన్నాడు.

Ravindra Jadeja Speaks Out on Batting Position Says Team Didn t Trust Me He Expresses Frustration

కీలకమైన బ్యాటింగ్ స్థానాల్లో కాకుండా లోయర్ ఆర్డర్లో కొన్నిసార్లు స్పెషలిస్ట్ బౌలర్ల కంటే దిగువన పంపడం తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసిందని రవీంద్ర జడేజా ఆవేదన వ్యక్తం చేశాడు. "డ్రెస్సింగ్ రూమ్‌లో ప్యాడ్లు వేసుకుని కూర్చున్నప్పుడు నా పక్కనే ఒక ఫాస్ట్ బౌలర్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతుంటే నా మనోధైర్యం దెబ్బతినేది. నా కంటే ముందు ఒక బౌలర్ బ్యాటింగ్‌కు వెళ్లడం చూసినప్పుడు నా బ్యాటింగ్ సామర్థ్యంపై జట్టు యాజమాన్యానికి కనీస నమ్మకం లేదా అనే సందేహం కలిగేది" అని రవీంద్ర జడేజా వివరించాడు.

IND vs SL: దేవదత్ పడిక్కల్ శతకం.. తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం!

Also Read

IND vs SL: దేవదత్ పడిక్కల్ శతకం.. తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం!

ఈ తరహా నిర్ణయాల వల్ల తన బ్యాటింగ్ నైపుణ్యంపై తనకే సందేహాలు మొదలయ్యాయని.. దాని ప్రభావం స్టేడియంలో ఆత్మవిశ్వాసంపై పడిందని రవీంద్ర జడేజా అంగీకరించాడు. టెస్టుల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. తనను కేవలం బౌలింగ్ ఆల్-రౌండర్‌గానే చూసి లోయర్ ఆర్డర్‌కే పరిమితం చేయడంపై రవీంద్ర జడేజా వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Story first published: Sunday, August 16, 2026, 15:07 [IST]
Other articles published on Aug 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+