Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్బులు విసిరారు: సంగీత్‌లో కత్తి తిప్పిన జడేజా

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గ్రౌండ్‌లోనే కాదు వెలుపల కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. కత్తి తిప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. గుజరాత్‌కు చెందిన మెకానికల్ ఇంజనీర్ రీవా సోలంకీతో ఆదివారం రాత్రి రవీంద్ర జడేజా వివాహం జరగనుంది.

 Ravindra Jadeja seen brandishing sword during his sangeet ceremony

అయితే అందులో భాగంగా శనివారం రాత్రి సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ సంగీత్ వేడుకలో జడేజా తనకు కాబోయే భార్యతో కలిసి చిందులేశాడు. అంతేకాదు కత్తి తిప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. జడేజా ఒంటి చేత్తో కత్తి తిప్పుతుంటే అక్కడున్న వారంత అతడిపై అభిమానంతో డబ్బులు విసిరారు.

కాగా ఆదివారం సాయంత్రం రవీంద్ర జడేజా, సోలంకీల వివాహం రాజ్ కోట్‌లో జరగనుంది. రాజ్ కోట్‌కు చెందిన కాంట్రాక్టర్, వ్యాపారవేత్త ఏకైక కుమార్తె రివా సోలంకీతో జడేజా వివాహం, అత్తవారి స్టార్ హోటల్‌లో జరగనుంది. ఈ వివాహానికి సర్వం సిద్ధమైంది.

ఈ వివాహంలో జడేజా సహచరులు గుజరాత్ జట్టు కెప్టెన్ సురేష్ రైనా, డ్వెన్ బ్రావో ఆడి పాడనున్నారు. ఫిబ్రవరి 5న రీవా సోలంకితో జడేజా ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈరోజు వారిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. గుజరాత్ లయన్స్ జట్టు ఆటగాళ్లంతా పెళ్లిలో భాగం కానున్నారు.

ఈ వివాహానికి టీమిండియా క్రికెటర్లతో పాటు మాజీలు, జట్టు సిబ్బంది పలువురు హాజరుకానున్నారు. పెళ్లి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గుజరాత్ లయన్స్ ఆడుతున్న రవీంద్ర జడేజా శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేదు. 21న సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా జడేజా ఆడకపోవచ్చు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+