మొహాలి టెస్టు: కోహ్లీ కోరడంతో బ్యాట్‌ని కత్తిలా తిప్పిన జడేజా
మొహాలి: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా మొహాలిలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన కెరీర్‌లోనే ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో 90 పరుగులు సాధించి తృటిలో సెంచరీని మిస్ చేసుకున్న జడేజా జట్టుని పటిష్ట స్థితిలో నిలిపాడు.
అంతేకాదు మొహాలి టెస్టులో సాధించిన 90 పరుగులే టెస్టు క్రికెట్‌లో జడేజా సాధించిన అత్యధిక స్కోరు. అంతకుముందు జడేజా అత్యధిక టెస్టు స్కోరు 68గా ఉంది. ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన జడేజా 90 పరుగులతో అర్థశతకం సాధించాడు. జయంత్ యావద్‌తో కలిసి జడేజా 80 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

బ్యాట్‌ని కత్తిలా తిప్పిన జడేజా
అయితే అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత జడేజా మైదానంలో తన చేతిలో ఉన్న బ్యాట్‌ని కత్తిలా తిప్పాడు. ఇదంతా కూడా కెప్టెన్ కోహ్లీ మేరకే చేసినట్లు మ్యాచ్ అనంతరం జడేజా స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌లో జడేజా రాణించిన ప్రతిసారీ కోహ్లీ పెవిలియన్ నుంచి ఉత్సాహపరుస్తుంటాడు. ప్రధానంగా జడేజా అర్ధసెంచరీ చేసిన తర్వాత బ్యాటును కత్తిలా తిప్పమని కోరుతుంటాడు.

పెవిలియన్ వైపు చూసి అభివాదం
అర్ధసెంచరీ చేసిన తర్వాత పెవిలియన్ వైపు చూసి అభివాదం చేయడం, అప్పుడు కోహ్లీ కోరినట్టు జడేజా బ్యాటును కత్తిలా తిప్పడం ఈ మధ్య జరుగుతోంది. తాజాగా మూడో టెస్టులో అర్ధ సెంచరీతో రాణించిన జడేజా... పెవిలియన్ వైపు చూడగా, బ్యాటుతో కత్తియుద్ధానికి ముందు చేసిన అభివాదం చేయమంటూ కోహ్లీ కోరాడు.

మ్యాచ్ అనంతరం జడేజా స్పందన ఇదీ
దీంతో జడేజా బ్యాటును కత్తిలా తిప్పి స్టేడియంలోని అభిమానులను అలరించాడు. మ్యాచ్ అనంతరం ఈ డ్యాన్స్ గురించి జడేజా స్పందిస్తూ రాజ్‌పుత్ కావడం వల్ల విజయాన్ని ఆస్వాదిస్తూ బ్యాటును కత్తిలా తిప్పాను. ఎందుకంటే నేను మైదానంలో కత్తిని తిప్పలేను కదా అంటూ పేర్కొన్నాడు.

లోయర్ ఆర్డర్ రాణించడం జట్టుకు కలిసొస్తుంది
ప్రస్తుతం భారత జట్టు లోయర్ ఆర్డర్ బాగా ఆడుతుండటం జట్టుకు కలిసొస్తుందని జడేజా పేర్కొన్నాడు. రాజ్ పుత్ సామాజిక వర్గానికి జడేజాకు కత్తియుద్ధం, గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టం. జడేజా దగ్గర మేలుజాతి గుర్రాలు, కత్తులు సేకరించి ఉంచుకునే అలవాటు కూడా ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications