Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravindra Jadeja : టీమిండియాలోకి రవీంద్ర జడేజా రీఎంట్రీ కష్టమేనా?

Ravindra Jadeja return to Team India is a tough call

ఆసియా కప్ సమయంలో మోకాలి గాయంతో జట్టుకు దూరమైన టీమిండియా స్టార్ రవీంద్ర జడేజా రీఎంట్రీ చేయడం కష్టంగా కనపడుతోంది. అతని గైర్హాజరీలో జట్టులో వరుసగ అవకాశాలు పొందుతున్న అక్షర్ పటేల్ ప్రతిసారీ తన సత్తా నిరూపించుకుంటూనే ఉన్నాడు. తాజాగా లంకతో జరిగిన రెండో వన్డేలో కూడా రాణించాడు. ఇంకా వాషింగ్టన్ సుందర్ బెంచ్‌పై ఉన్నాడు. ఇలాంటి సమయంలో జడ్డూ రీఎంట్రి చాలా కష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణాలు ఏంటంటే..

వైట్ బాల్ కష్టాలు

వైట్ బాల్ కష్టాలు

ఇటీవలి కాలంలో రవీంద్ర జడేజా పరిమిత ఓవర్ల క్రికెట్లో ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. చివరగా 2018లో కేవలం 8 మ్యాచుల్లోనే 14 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న అతను.. ఆ తర్వా ఆ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ ఏడాదిలో జడ్డూ యావరేజ్ 24.57గా ఉంది. అయితే ఆ తర్వాత వరుసగా మూడేళ్లలో అతని యావరేజిలు 38, 64.23, 53.92గా నమోదైంది.

ఇలాంటి యావజరేజితో అతను అంతర్జాతీయ రీఎంట్రీ చేయడం కష్టమే. అదే సమయంలో అక్షర్, వాషింగ్టర్ సుందర్ ఈ విషయంలో మందంజలో ఉన్నారు.

గ్యాప్ లేకుండా విశ్రాంతి

గ్యాప్ లేకుండా విశ్రాంతి

2020లో భారత జట్టు మొత్తం 9 వన్డేలు ఆడింది. వీటన్నింటిలోనూ జడేజా కూడా ఆడాడు. అయితే ఇలా భారత జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లో జడ్డూ పాల్గొనలేదు. 2022లో భారత్ మొత్తం 6 వన్డేలు మాత్రమే ఆడింది. ఆ తర్వాత ఆడిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా జడ్డూ ఆడలేదు. ఇక 2022 లెక్కలు తీసుకుంటే భారత జట్టు 24 వన్డేలు ఆడగా.. జడ్డూ కేవలం 8 మ్యాచుల్లోనే కనిపించాడు. ఇక ఇప్పుడు మోకాలి గాయం నుంచి కోలుకొని నేరుగా టీమిండియా పునరాగమనం వద్ద ఒక ఉపద్రవం ఎదురవడం అవనడం గ్యారంటీగా కనిపిస్తోంది.

అక్షర్ సూపర్ హిట్

అక్షర్ సూపర్ హిట్

రవీంద్ర జడేజా జట్టుకు దూరం అవడంతో అదే మాదిరి ఎడం చేతి వాటం స్పిన్నరు కాల్సి ఉంటుంది..తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అంతకుముందు పటేల్ బ్యాటింగ్ కొంత సమస్యాత్మకంగా ఉండేది. అయితే దీన్ని చాలా మెరుగు పరుచుకున్నాడు.

ఒక్క 2022లోనే అక్షర్ పటేల్ 8 మ్యాచులోనూ రాణించాడు. ఈ మ్యాచుల్లో 33 సగటుతో 198 పరుగులు చేశాడు. అలాగే 11 వికెట్లు తీసుకొని, ఐదు మ్యాచుల్లో అక్షర్ అద్భుతంగా రాణించాడు. ఇలా రోజులు గడిచేకొద్దీ అక్షర్ తనకు దక్కిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకొని జట్టులో స్థానం పదిలం చేసుకుంటున్నాడు.

Story first published: Friday, January 13, 2023, 19:31 [IST]
Other articles published on Jan 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+