Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravindra Jadeja: రవీంద్ర జడేజా రిటైర్మెంట్?

Ravindra Jadeja: టీమిండియాలోని ఇద్దరు కీలక ఆటగాళ్లు ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. మొదట రోహిత్ శర్మ, ఆ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. వాళ్లిద్దరు వెంటవెంటనే రిటైర్మెంట్ ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉండగా.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. జడేజా ఇన్‌స్టా స్టోరీని చూసిన అభిమానులు వేరేలా అర్థం చేసుకుంటున్నారు.

ప్రశ్నలను లేవనెత్తిన జడేసా ఇన్‌స్టా స్టోరీ
రవీంద్ర జడేజా గురువారం భారత టెస్ట్ జెర్సీని ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీని పంచుకున్నాడు. టెస్ట్ చరిత్రలో అత్యధిక కాలం నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచిన ఘనతను సాధించిన ఒక రోజు తర్వాత ఈ పోస్ట్ వచ్చింది. అయితే రవీంద్ర జడేజా పోస్ట్ నేపథ్యంలో అభిమానుల్లో ఊహాగానాలు పెరిగిపోయాయి. ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జడేజా టెస్ట్ జెర్సీతో ఉన్న ఫోటోను పోస్ట్ చేయడంతో రవీంద్ర జడేజా కూడా టెస్టులకు దూరం కానున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Ravindra Jadeja Retirement Rumors Spark After Cryptic Instagram Post

జట్టులో అత్యంత సీనియర్ ఆటగాళ్లు జడేజా ఒకరు..

36 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్ విరాట్ కోహ్లీ అండర్-19 రోజుల నుంచి సహచరుడిగా కొనసాగుతున్నాడు. భారత టెస్ట్ క్రికెట్ జట్టులో మిగిలి ఉన్న సీనియర్లలో జడేజా ఒక్కడే ఉన్నాడు. రవీంద్ర జడేజా భవిష్యత్తు గురించి కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. గత సంవత్సరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20 ఫార్మాట్ నుంచి వైదొలిగిన వెంటనే రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు వారిద్దరు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో మళ్లీ జడేజా గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. అభిమానులు కూడా అలాగే భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐసీసీ తాజా టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చాలా కాలంగా ప్రపంచంలో మరే ఇతర ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నుంచి ఈ నంబర్ వన్ కిరీటాన్ని లాక్కోలేకపోయాడు. టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో చాలా కాలం పాటు నంబర్ వన్ స్థానంలో నిలిచిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రవీంద్ర జడేజా ఇప్పుడు నిలిచాడు.

అద్భుతాలు చేసిన రవీంద్ర జడేజా
రవీంద్ర జడేజా 1,151 రోజులు టెస్ట్ ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు కూడా ఈ ఘనతను సాధించలేకపోయాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత జడేజా ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం చాలా ఊహాగానాలకు దారితీసింది. జడేజా కూడా రిటైర్ అవుతాడా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జడేజా భవిష్యత్ గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Story first published: Friday, May 16, 2025, 10:04 [IST]
Other articles published on May 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+