టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు. గంభీర్‌తో పాటు టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రవీంద్ర జడేజాను ఎందుకు ఎంపిక చేయలేదో వివరణ ఇచ్చారు.
టీ20 వరల్డ్ కప్ విజయానంతరం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు 35 ఏళ్ల రవీంద్ర జడేజా కూడా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టులకు అందుబాటులో ఉంటానని జడేజా పేర్కొన్నాడు. అయితే ఆగష్టు 2 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక మూడు వన్డేల సిరీస్‌కు జడేజా ఎంపిక కాలేదు. కానీ కోహ్లి, రోహిత్ సెలక్ట్ అయ్యారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్‌లో జరిగే ఈ మెగాటోర్నీకి జట్టుకూర్పు గురించి ఓ ప్రణాళిక రావాలని.. విశ్రాంతి తీసుకోవాలని భావించిన కోహ్లి, రోహిత్‌లను సైతం లంక వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. కానీ జడేజాను మాత్రం పక్కనపెట్టారు. దీంతో జడేజాను పక్కనపెట్టారని, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లను స్పిన్ ఆల్‌రౌండర్లుగా జట్టులో కొనసాగించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.
అయితే జడేజాను తప్పించలేదని సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్‌లు మొదలుకానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలో జడేజా లేనట్లు కాదని గంభీర్ అన్నాడు. మరోవైపు అజిత్ అగార్కర్ మాట్లాడుతూ..సుదీర్ఘ టెస్టు షెడ్యూల్ ఉందని, అందుకే జడేజాకు విశ్రాంతి ఇచ్చామని అన్నాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఇద్దరినీ ఎంపిక చేయలేమని, ఇద్దరిలో ఒకరు బెంచ్‌రే పరిమితం కావాల్సి ఉంటుందని అగార్కర్ పేర్కొన్నాడు.
స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లతో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్, అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ నుంచి ఆస్ట్రేలియాలో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది.