Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఇంత చెత్త షాట్లు ఆడతారా?.. జడేజాపై మండిపడుతున్న ఫ్యాన్స్

Ravindra Jadeja recklesly throws away his wicket

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై అభిమానులు మండిపడుతున్నారు. జట్టులో సీనియర్ బ్యాటర్ అయ్యుండి అనవసరమైన షాట్‌తో వికెట్ పారేసుకోవడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు. తన అనుభవాన్ని చూపించుకోవాలి కానీ, ఇలా అడ్డదిడ్డమైన షాట్లు ఆడటం ఏంటని మండిపడుతున్నారు. మూడో రోజు చక్కగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 289/3 స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించింది.

ఆట మొదలైన తర్వాత కోహ్లీ, జడేజా ఇద్దరూ క్రీజులో ఎలాంటి ఇబ్బంది లేకుండానే కనిపించారు. ఈ రోజు మొత్తం భారత బ్యాటర్లే ఆడతారని ఫ్యాన్స్ అనుకున్నారు. కనీసం తొలి సెషన్ వరకైనా వీళ్లిద్దరే క్రీజులో ఉంటారని ఆశించారు. కానీ రవీంద్ర జడేజా అనవసరంగా చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకున్నాడు. టాడ్ మర్ఫీ వేసిన ఆ ఓవర్ మొత్తం జడ్డూ ఇబ్బందిగానే క్రీజులో కదిలాడు. తొలి బంతికే బౌండరీ బాదిన అతను.. ఆ తర్వాత మరో భారీ షాట్ ఆడబోయి అవటయ్యేవాడు. కానీ అదృష్టం కలిసొచ్చి ఆ బంతి ఎవరీకీ క్యాచ్ వెళ్లలేదు.

ఆ తర్వాత మళ్లీ అలాంటి షాటే ఆడాడీ ఎడం చేతి వాటం బ్యాటర్. మిడాన్ మీదుగా ఆడేందుకు ట్రై చేశాడు. కానీ అక్కడ ఉన్న ఫీల్డర్ ఖవాజాను క్లియర్ చేయలేకపోయాడు. దీంతో ఖవాజాకు సులభమైన క్యాచ్ దక్కింది. ఇలా జడ్డూ తన వికెట్ పారేసుకోవడం చూసిన ఫ్యాన్స్ అతన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు.

జడ్డూ ఇలాంటి చెత్త షాట్లు ఆడతాడు కాబట్టే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్ కాలేకపోయాడని తిడుతున్నారు. మరికొందరు అసలు జడ్డూ ప్లాన్ ఏంటో కూడా తమకు తెలియడం లేదని, ఇంత పిచ్చి షాట్లు అతను ఎందుకు ఆడాడని నిలదీస్తున్నారు. జడ్డూ కూడా కేఎల్ రాహుల్‌లాగే సరైన డెసిషన్స్ తీసుకోలేని ఆటగాడని, కాకపోతే రాహుల్ సీనియర్ బ్యాటర్ అవడంతో అందరి కంటా పడతాడని విమర్శిస్తున్నారు.

Story first published: Sunday, March 12, 2023, 11:16 [IST]
Other articles published on Mar 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+