
మొదటి స్థానంలో జడేజా
ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఐపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉండడానికి ముందు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో జడేజా ఇప్పటివరకు 200 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఏ జట్టుకు కూడా కెప్టెన్సీ చేసే అవకాశం రాలేదు. తొలి సారిగా సీఎస్కే తరఫున కెప్టెన్సీ చేసి అవకాశం దక్కింది.

రెండో స్థానంలో మనీష్ పాండే
ఇక ఈ జాబితాలో మనీష్ పాండే రెండో స్థానంలో ఉన్నాడు. మనీష్ ఐపీఎల్‌లో 153 మ్యాచ్‌లు ఆడిన తర్వాత కెప్టెన్సీ చేశాడు. ఇక కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో పొలార్డ్ 137 మ్యాచ్‌లు ఆడిన తర్వాత రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయంలో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కింది.

అశ్విన్, శాంసన్ స్థానం ఎంతంటే..
ఇక ఐపీఎల్‌లో 111 మ్యాచ్‌లు ఆడిన తర్వాత కెప్టెన్సీ చేపట్టిన రవిచంద్రన్ అశ్విన్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 107 మ్యాచ్‌ల అనంతరం కెప్టెన్సీ చేపట్టిన సంజూ శాంసన్ ఐదో స్థానంలో, 103 మ్యాచ్‌ల అనంతరం కెప్టెన్సీ చేపట్టిన భువనేశ్వర్ కుమార్ ఆరో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లో అశ్విన్ పంజాబ్‌కు, సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌కు, భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్సీ చేపట్టారు

టాస్ గెలిచిన కోల్‌కతా
ఇక క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతుండగా.. కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయబోతుంది. ఈ మ్యాచ్‌తో రవీంద్ర జడేజా కెప్టెన్‌గా కొత్త బాధ్యతలను మొదలుపెట్టాడు. అటు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చాలా కాలం తర్వాత మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.

తుది జట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, షెల్డన్ జాక్సన్, ఉమేష్ యాదవ్, శివమ్ మావి, వరుణ్ చకరవర్తి.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా (కెప్టెన్), శివమ్ దూబే, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్ ), డ్వేన్ బ్రావో, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, తుషార్ దేశ్‌పాండే.


Click it and Unblock the Notifications













