అవకాశాలు రాకున్నా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు: జడేజాపై గంగూలీ ప్రశంసల వర్షం

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. మరిన్ని అవకాశాలు రాకున్నా ఆత్మవిశ్వాసం కోల్పేలేదని గంగూలీ అన్నాడు. గత పదేళ్లుగా రవీంద్ర జడేజా టీమిండియా తుది జట్టులో చోటు కోసం పోరాడుతూనే ఉన్నాడు.
జట్టులోకి రావడం.. పోవడం లాంటివి జరిగిన... తనకు అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా ఒడిసిపట్టుకునేవాడని గంగూలీ ఈ సందర్భంగా తెలిపాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ తొలి సెమీస్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడేజా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జట్టుకు అవసరమైన పరుగులు చేశాడని తెలిపాడు.

ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన జడేజా
ప్రస్తుతం వెస్టిండిస్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌లో సైతం ఫరవాలేదనిపించాడు. ఆంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన జడేజా(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ముఖ్యంగా రహానేతో కలిసి టీమిండియాకు భారీ స్కోరు సాధించిపెట్టడంతో కీలకపాత్ర పోషించాడు. టీమిండియాకు సుదీర్ఘ కాలం సేవలందిస్తానని అతడు నిరూపించుకున్నాడని గంగూలీ కొనియాడాడు.

గంగూలీ మాట్లాడుతూ
గంగూలీ మాట్లాడుతూ "రవీంద్ర జడేజా చేసిన ప్రయత్నాలను తప్పక ప్రస్తావించాలి. మరిన్ని అవకాశాలు రాకున్నా ఆత్మవిశ్వాసం కోల్పేలేదు. అది వన్డేలు లేదా టెస్టుల్లో అయినా. ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలి టెస్టులో టీమిండియాకు అవసరమైనప్పుడు అతను రాణించాడు" అని చెప్పుకొచ్చాడు.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం
కాగా, 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా ఇప్పటివరకు 42 టెస్టులు, 42 టీ20లు, 156 వన్డేలు ఆడాడు. ఒకప్పుడు అశ్విన్, జడేజాలు తుది జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లుగా కొనసాగినప్పటికీ... చైనామన్ స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ రాకతో చాలినన్ని అవకాశాలు దక్కడం లేదు.

విండిస్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై
కాగా, విండిస్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై దాదా మాట్లాడుతూ "టీమిండియా పేసర్ల బౌలింగ్ చూస్తుంటే గర్వంగా ఉంది. కొన్నాళ్లుగా జట్టుకు జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఆకట్టుకుంటున్నాడు. షమి, ఇషాంత్ రాణిస్తున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌లు సరిచేసుకోవడంలో ఇషాంత్ ఎంతో మెరుగయ్యాడు. పాత బంతితో వైవిధ్యం చూపిస్తున్నాడు. మరింత మెరుగయ్యాడు' అని గంగూలీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications