Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌కు కూడా మిస్..! ప్రాక్టీస్ కాకుండా సాహసాలు చేస్తారా? జడేజా గాయంపై బీసీసీఐ పెద్దల సీరియస్

Ravindra Jadeja Missed the T20 World cup, BCCI Serious About Jadeja Injury

ముంబైలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వచ్చే టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యాడు. తాజా నివేదికల ప్రకారం ఈ విషయం తెలిసింది. అయితే అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. అయితే రవీంద్రా జడేజా గాయం గురించి మరో ఆసక్తికర విషయం కూడా చర్చనీయాంశమవుతుంది. హాంకాంగ్‌తో జరిగిన ఆసియాకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ టీం అందరికి కాలక్షేపం కోసం బీచ్‌లకు, షికార్లకు తీసుకెళ్లింది. సూపర్ 4 స్టేజ్ మ్యాచ్ కోసం టైం ఉండడంతో ఆటగాళ్లకు కాస్త రిలీఫ్ ఉంటుందని టీం అభిప్రాయం. అయితే అదే కొంపముంచింది.

వాటర్ బేస్డ్ శిక్షణలో జారిపడి

వాటర్ బేస్డ్ శిక్షణలో జారిపడి

ఈ టైంలో రవీంద్రా జడేజా ఓ సాహసానికి ఒడిగట్టాడట. అందువల్లే అతని కుడి మోకాలికి గాయమై అది సర్జరీకి దారి తీసిందట. వాటర్ బేస్డ్ శిక్షణ కోసం జడేజాను పూనుకోగా.. స్లిప్పయి పడ్డాడట. అతని కుడి మోకాలి ఒరుసుకుపోవడంతో హుటాహుటిన స్థానిక హాస్పిటాల్లో చేర్చాడు. అక్కడ సర్జరీ అవసరమవుతుందని డాక్టర్ చెప్పడంతో టీం మేనేజ్ మెంట్ ఖంగుతిందటా. ఇక ఆటగాళ్లు ప్రాక్టీస్ కన్నా సరదాలనే సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తూ గాయపడుతుండడం జట్టు పరంగా కాస్త ఆందోళనకు గురిచేసేంది.

 జడేజా గాయంపై బీసీసీఐ పెద్దలు సీరియస్

జడేజా గాయంపై బీసీసీఐ పెద్దలు సీరియస్

'జడేజా ఒక అడ్వెంచర్ యాక్టివిటీలో పాల్గొన్నాడు. అది ఒకరకమైన స్కీ-బోర్డ్‌లో తనను తాను అతను బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ భారత ప్రాక్టీస్ మాన్యువల్‌లో భాగం కాదు. ఇది పూర్తిగా అనవసరం. ఈ క్రమంలో అతను జారిపడి మోకాలికి దెబ్బ తగిలించుకున్నాడు. ఇది శస్త్రచికిత్సకు దారితీసింది' అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జడేజా గాయానికి దారితీసిన సంఘటనల గురించి అధికారిక ప్రకటనలు విడుదల కానప్పటికీ.. కొంతమంది బీసీసీఐ అధికారులు భారత స్టార్ ఈ రకంగా గాయపడడంతో తీవ్రంగా మండిపడుతున్నట్లు అర్థమవుతోంది. మెగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఈవెంట్‌కు ముందు జట్టు బ్యాలెన్స్ కోసం ఓ పక్క బీసీసీఐ చూస్తుంటే అనవసర తప్పిదాలతో ప్లేయర్లు ఇలా గాయాల బారిన పడడం బీసీసీఐ అధికారులకు ఏమాత్రం నచ్చట్లేదని' దీని పట్ల టీం మేనేజ్‌మెంట్‌తో కూడా సంప్రదించినట్లు తెలిసింది.

 ద్రావిడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు

ద్రావిడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు

అయితే టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఆల్రౌండర్ రవీంద్రా జడేజా విషయంలో చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఈ విషయం గురించి ద్రావిడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జట్టుకు సమతూకం తెచ్చే జడేజా సేవలు భారత్ కోల్పోనుంది. గ్రూప్ దశల్లో హాంకాంగ్ విజయం తర్వాత మోకాలి గాయంతో రవీంద్ర జడేజా దూరమవ్వడంతో టీమిండియా ఆసియా కప్ టోర్నీ ఫైనల్ చేరకుండానే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. సూపర్ 4దశలో పాకిస్తాన్ చేతిలో, శ్రీలంక చేతిలో ఇండియా త్రుటిలో ఓటమిని మూటగట్టుకుంది. జడేజా లాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడు లేకపోవడంతో జట్టు కూర్పు అస్తవ్యస్తమయింది.

Story first published: Friday, September 9, 2022, 16:17 [IST]
Other articles published on Sep 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+