హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం వెనుక టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. పుణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓడినా తిరిగి పుంజుకుని సిరీస్‌ను 2-1తో దక్కించుకోవడంలో జడేజా కీలకపాత్ర పోషించాడు.
ఈ సిరిస్‌లో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయడంలో విఫలమైనతే జడేజా మాత్రం ఆసీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఈ సిరిస్‌లో మొత్తం 25 వికెట్లు తీసిన జడేజా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అవార్డు అందుకున్నాడు. ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్టులో మొత్తం నాలుగు వికెట్లు తీశాడు.

ఇక పూణె టెస్టులో ఐదు వికెట్లు, బెంగళూరులో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక డ్రాగా ముగిసిన రాంచీ టెస్టులో జడేజా 9 వికెట్లు తీసి తన విశ్వరూపం ప్రదర్శించాడు.