Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియాకు గుడ్ న్యూస్.. రవీంద్రా జడేజా మోకాలి సర్జరీ సక్సెస్.. అప్పటిలోపు జట్టుకు రెడీ..!

 Ravindra Jadeja Knee Surgery Successfull He Might Have Recovered for T20 World Cup

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి అర్ధాంతరంగా దూరమైన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక టైంలో రాణించిన జడేజా మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఇక హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కీలక రనౌట్ చేసి జట్టుకు టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఇకపోతే హాంకాంగ్ మ్యాచ్ అనంతరం మోకాలి గాయం ముదరడంతో అతను ఆసియా కప్ టీం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇక అతనికి మోకాలి ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రవీంద్రా జడేజా అప్డేట్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ తన శిక్షణ, ఫిట్ నెస్ కార్యక్రమాలు మొదలు పెడతానని కూడా చెప్పాడు.

మోకాలి గాయం కారణంగా 33ఏళ్ల జడ్డూ ఆసియా కప్ నుండి తప్పుకున్నట్లు ఓ వార్తా సంస్థ నివేదించగా.. అందరూ తప్పుడు వార్త అనుకున్నారు. కానీ తర్వాత అన్ని న్యూస్ వెబ్ సైట్లు, ఛానల్స్ ఈ విషయాన్ని కన్ఫాం చేయడంతో పాటు బీసీసీఐ కూడా ప్రకటించడంతో నిర్ధారణకు వచ్చారు. 'సర్జరీ విజయవంతమైంది. నేను త్వరలో నా రిహబిలిటేషన్ ప్రారంభిస్తాను. నేను వీలైనంత త్వరగా తిరిగి గ్రౌండ్లో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తాను' అని జడేజా తాను చేసిన పోస్టులో పేర్కొన్నాడు. అలాగే ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ పట్టుకుని దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు.

బీసీసీఐకి, నా సహచరులకు, సహాయక సిబ్బందికి, ఫిజియోలకు, వైద్యులకు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు అండగా నిలిచి.. తన రికవరీ కోరుకున్న వీరిందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అని జడేజా పేర్కొన్నాడు. ఇక జడేజా ఎప్పుడు జట్టులోకి అందుబాటులోకి రానున్నాడనే విషయమై ఓ సీనియర్ బీసీసీఐ అధికారి నిర్దిష్ట కాలమంటూ ఏమీ లేదని ఎప్పుడూ కోలుకుంటే అప్పుడు వస్తాడని చెప్పారు. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ‌కప్‌కు జడేజా తిరిగి జట్టులోకి రాగలడా అనే దానిపై టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం వస్తాడన్నట్లే చెప్పాడు. మరో 40రోజులు టైం ఉండడం.. సర్జరీ సక్సెస్ కావడంతో పాటు రవీంద్రా జడేజా స్టేట్ మెంట్ చూస్తుంటే అతను మరో నెల రోజుల్లోనే పూర్తి ఫిట్ నెస్ సాధించి జట్టులోకి వచ్చే వీలుంటుంది. అందువల్ల ఈ టీ20 ప్రపంచకప్ టైంకు అతను జట్టులోకి రావొచ్చని స్పష్టమవుతుంది. అదే జరిగితే టీమిండియాకు గుడ్ న్యూసే. ఎందుకంటే జడేజా లేని లోటు ప్రస్తుతం టీమిండియాలో స్పష్టంగా కన్పిస్తుంది. కీలక టైంలో జడేజా విలువైన ప్రదర్శన కనబర్చడంతో పాటు మెరుపు ఫీల్డింగ్‌‌కు జడ్డూ పెట్టింది పేరు.

Story first published: Wednesday, September 7, 2022, 12:16 [IST]
Other articles published on Sep 7, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+