ఈ దశాబ్దంలో జడేజానే బెస్ట్ ఫీల్డర్.. బ్యాట్స్‌మన్, బౌలర్‌గా సూపర్!!

ఢిల్లీ: ఈ దశాబ్దంలో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డర్. బ్యాట్స్‌మన్, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు అని టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్ పేర్కొన్నారు. టీమిండియా టెస్టు ఫార్మాట్‌లో కూడా వరుస విజయాలతో దూసుకెళుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు స్వదేశంలో వరుసగా 11 సిరీస్ విజయాలను సొంతం చేసుకుని ఆస్ట్రేలియా (10 సిరీస్‌లు) రికార్డును బద్దలు కొట్టింది.

శ్రీధర్ రాకతో ఫీల్డింగ్ విభాగం పటిష్టం:
టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తున్నారు. గత కొంతకాలంగా పేస్ కొరత ఉండగా.. ఇప్పుడు అది కూడా తీరిపోయింది. అయితే టీమిండియా జట్టు వరుస విజయాలు సాధించడం వెనుక ఫీల్డింగ్ కూడా ఎంతో ప్రాముఖ్యత పోషిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఎంతో పటిష్టంగా ఉన్నా.. ఫీల్డింగ్‌ను మాత్రం తక్కువచేయలేం. ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తన తన విభాగాన్ని పటిష్టం చేసాడు. ఈ కారణంతోనే శ్రీధర్ మరోసారి టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.

జడేజానే బెస్ట్ ఫీల్డర్:
తాజాగా భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరనే ప్రశ్న శ్రీధర్‌కు ఎదురవగా.. రవీంద్ర జడేజానే అని తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు. 'మైదానంలో జడేజా ఫీల్డింగ్, చురుకుతనం జట్టులో స్ఫూర్తి నింపుతుంటుంది. సర్కిల్‌లో జడేజా ఉంటే.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వికెట్ల మధ్య పరుగు తీసే ముందు ఆలోచిస్తాడు. ఫీల్డింగ్‌లో అద్భుతాలు చేసి అసాధారణ మ్యాచ్‌లను కూడా కాపాడాడు. ఈ పదేళ్ల కాలంలో జడేజానే బెస్ట్ ఫీల్డర్. భారత్‌కు దొరికిన అత్యుత్తమ ఫీల్డర్ జడేజా' అని శ్రీధర్ పేర్కొన్నారు.

ఫీల్డర్‌గా తనదైన ముద్ర వేసిన జడేజా:
'జడేజా ఒక బ్యాట్స్‌మన్, బౌలర్‌గానే కాకుండా ఫీల్డర్‌గా కూడా తనదైన ముద్ర వేశాడు. ప్రస్తుతం జడేజా, మార్టిన్ గప్తిల్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ అత్యుత్తమ ఫీల్డర్‌లు. వీరందని మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్‌కి ఉంచినా.. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంటారు' అని శ్రీధర్ తెలిపాడు. ప్రపంచకప్-2019లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో ఆడిన జడేజా.. ఏకంగా 41 పరుగుల్ని జట్టుకి సేవ్ చేశాడు. టోర్నీలో ఏ ఫీల్డర్ కూడా ఇన్ని పరుగుల్ని సేవ్ చేయలేదు.

పాయింట్‌లోనే ఫీల్డింగ్:
పవర్‌ప్లేలో 30 అడుగుల సర్కిల్‌లో జడేజా ఫీల్డింగ్ చేస్తాడు. మ్యాచ్‌లో ముప్పావు వంతు పాయింట్‌లోనే ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలలో మాత్రం మిడ్‌వికెట్ దిశగా ఫీల్డింగ్ చేస్తుంటాడు. ఎక్కడ చేసినా బంతిని మాత్రం వదలకుండా పట్టుకుంటాడు. ఇప్పటి వరకూ 146 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో జడేజా 133 క్యాచ్‌లు అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications