Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja hits six sixes in an over in Saurashtra Cricket Association tournament

హైదరాబాద్: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదాడు. యువరాజ్ సింగ్ 2007 సెప్టెంబరు నెలలో ఒకే ఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సులు కొట్టిన విషయం ఒక సంచలనమైంది. అదే స్థాయిలో జడేజా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టాడు. అయితే యువరాజ్ సింగ్ ఐసీసీ టీ 20 ప్రపంచకప్ లో ఆడితే జడేజా సౌరాష్ట్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎంత కష్టపడినా భారత వన్డే జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్‌ జిల్లా టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. శుక్రవారం జామ్‌నగర్‌ జట్టు అమ్రేలీ జట్టుతో తలపడింది. 120 పరుగుల తేడాతో జామ్ నగర్ జట్టే విజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో చెలరేగిపోయిన రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. నీలమ్‌ వంజా అనే స్పిన్నర్‌ బౌలింగ్‌ చేస్తున్న ఓవర్లో ఈ ఘనతను సాధించాడు. మ్యాచ్ పూర్తయ్యేసరికి జడేజా 69 బంతుల్లోనే 154 పరుగులు చేయడం విశేషం. అతను 15 ఫోర్లు, 10 సిక్సర్ల బౌండరీలకు బంతిని పరిగెత్తేలా చేశాడు. కేవలం బౌండరీల స్కోరు 120 గా ఉంది. ఇతని బాదుడికి తోడై జట్టు 6 వికెట్లకు 239 పరుగుల చేసింది. ప్రత్యర్థి టీం ఇంత భారీ స్కోరును చేధించలేక పరాజయం పాలైంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 10:14 [IST]
Other articles published on Dec 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+