2008 తర్వాత మళ్లీ: టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో అశ్విన్, జడేజా
హైదరాబాద్: టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు అరుదైన ఘనతను సాధించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన టెస్టు ర్యాంకుల్లో భారత్‌కు చెందిన అశ్విన్, జడేజాలు సంయుక్తంగా నెంబర్ వన్ స్ధానంలో నిలిచారు. బెంగుళూరులో ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ముగిసిన అనంతరం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం టెస్టు ర్యాంకులను ప్రకటించింది.
బెంగుళూరు టెస్టుకు ముందు అశ్విన్ ఒక్కడే నెంబర్ వన్ స్ధానంలో ఉన్నాడు. బెంగుళూరులో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో జడేజా 7 వికెట్లు తీసుకోగా, రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిది వికెట్లు తీశాడు. దీంతో టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో రెండో స్ధానంలో ఉన్న జడేజా ఒక స్ధానం ఎగబాకి అశ్విన్‌తో సంయుక్తంగా నెంబర్ వన్ స్ధానానికి చేరాడు.
తన కెరీర్‌లో నెంబర్ వన్ స్ధానంలో జడేజా నిలవడం ఇదే మొదటి సారి. 2008లో నెంబర్ వన్ స్ధానాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీ ధరన్‌లు ఇలానే సంయుక్తంగా నెంబర్ వన్ స్ధానంలో నిలిచారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ 8 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు.

దిగ్గజ ఆటగాళ్ల సరసన అశ్విన్
రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 41 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీయడంతో తక్కువ పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసిన ఆటగాళ్ల సరసన చేరాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంతో అత్యంత వేగంగా ఐదు వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడం ఇది 25వ సారి.

ప్రపంచ రికార్డు నెలకొల్పిన అశ్విన్
ఈ నేపథ్యంలో అశ్విన్ మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బౌలర్ కూడా అశ్వినే. కేవలం 88 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇంతక ముందు ముత్తయ్య మురళీధరన్ 100, హెడ్లీకి 111 ఇన్నింగ్స్‌లు పట్టాయి.

8వికెట్లు తీసిన లియాన్ 16వ ర్యాంకులో
ఇదిలా ఉంటే రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు స్ధానాలు ఎగబాకి 16వ ర్యాంకులో నిలిచాడు. మరో ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ 28వ స్ధానంలో కొనసాగుతుండగా, ఉమేశ్ యాదవ్ 29వ స్ధానంలో కొనసాగుతున్నాడు.

బ్యాటింగ్‌లో స్టీవ్ స్మిత్ నెంబర్ వన్
ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఉన్న కోహ్లీ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండో స్థానంలో నిలిచాడు. బెంగుళూరు టెస్టులో కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతో ర్యాంకింగ్స్‌లో ఒక స్థానాన్ని కోల్పోయాడు.

23వ ర్యాంకులో కేఎల్ రాహుల్
రెం��ో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడిన పుజారా ఐదు స్థానాలు ఎగబాకి టాప్ సిక్స్‌లో చోటు దక్కించుకున్నాడు. మొత్తం 793పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచాడు. కేఎల్ రాహుల్ అత్యధికంగా 23 స్థానాలు ఎగబాకి 23వ ర్యాంకుని దక్కించుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications