
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. భారత అభిమానులకు ఈ ట్రోఫీ అనని రకాల ఫీలింగ్స్‌ను పంచింది. తొలి రెండు టెస్టుల్లో భారత జట్టు ఎదురు లేని విజయాలు సాధించింది. అదే జోరులో మూడో టెస్టులో కూడా భారత్ గెలుస్తుందని అంతి అనుకున్నారు. అయితే ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో అతను అద్భుతంగా రాణించాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని భారత్ పతనాన్ని శాసించాడీ ఎడం చేతి వాటం స్పిన్నర్.
ఈ క్రమంలోనే ఆసీస్ ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్‌కు అద్భుతమైన సహకారం అందించాడు. తనకు కొన్ని బౌలింగ్ టిప్స్ చెప్పాలని కునేమన్ కోరాడు. అయితే సిరీస్ మధ్యలో ఇలా ప్రత్యర్థికి సహకారం అందించడం కరెక్ట్ కాదని జడేజా భావించాడు. అందుకే సిరీస్ పూర్తయిన తర్వాత తనను కలవాలని సలహా ఇచ్చాడు. కునేమన్ అదే పని చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగియగానే వెంటనే జడేజాను కలిశాడు. అతని నుంచి కొన్ని విలువైన సలహాలు అందుకున్నట్లు వెల్లడించాడు. నాలుగో టెస్టు ముగిసిన వెంటనే తన జడేజాను కలిసినట్లు కునేమన్ తెలియజేశాడు. తన మాట నిలబెట్టుకున్న జడ్డూ.. కునేమన్‌తో పావుగంట సేపు బౌలింగ్ గురించి మాట్లాడాడట.
'ఒక పావుగంట మాట్లాడి ఉంటాం. నాకు జడేజా కొన్ని కీలకమైన సలహాలు ఇచ్చాడు. కేవలం క్రికెట్ గురించే కాకుండా మిగతా విషయాలు కూడా చాలా చర్చించుకున్నాం' అని కునేమన్ చెప్పాడు. మరోసారి భారత పర్యటనకు వస్తే జడ్డూ ఇచ్చిన సలహాలు కచ్చితంగా ఉపయోగపడతాయని కునేమన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ గురించి తనకు ఎలాంటి అనుమానాలు వచ్చినా తనను సంప్రదించాలని కునేమన్‌కు జడ్డూ బంపరాఫర్ ఇచ్చాడట. దీని కోసం ఇన్‌స్టాగ్రాంలో జడ్డూనే మెసేజ్ కూడా పంపాడట. ఇది చెప్పిన కునేమన్ తను చాలా సంతోషం వ్యక్తం చేశాడు.