రాజ్‌కోట్: టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా ఓ ఇంటివాడవుతున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లికి ముందే కాబోయే అల్లుడికి జడేజా అత్తింటివారు భారీ కానుకను అందించారు.
రూ. 97లక్షల విలువచేసే ఆడీ క్యూ7 కారును జడేజా మామ హర్దేవ్‌సింహ్ సోలంకీ కాబోయే అల్లుడికి బహుమతిగా ఇచ్చారు. రవీంద్ర జడేజా సోమవారం తన కాబోయే భార్య రివాబా సోలంకీతో కలిసి వెళ్లి స్థానిక షోరూం నుంచి కారు తెచ్చుకున్నారు.
రాజ్‌కోట్‌కు చెందిన హర్దేవ్‌సింహ్ దంపతుల ఏకైక కుమార్తె రివాబా సోలంకీతో రవీంద్ర జడేజాకు ఫిబ్రవరి 5న నిశ్చితార్థం జరిగింది. కాగా, ఏప్రిల్ 17న వీరిద్దరి వివాహం జరగనుంది.

జడేజా స్వగ్రామంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. ఏప్రిల్ 16న జడేజా తన క్రికెట్ మిత్రులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
కాగా, మెకానికల్ ఇంజినీరింగ్ చదివిని రివబా.. ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఆశిస్తోంది. ఇందు కోసం సివిల్ సర్వీసుల పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.