Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న జడేజా

India vs West Indies 2018 : 1st Test 2nd Day :Ravindra Jadeja Slams Century | Oneindia Telugu
Ravindra Jadeja entertains home crowd with maiden international hundred

హైదరాబాద్: కొద్ది నెలలుగా టీమిండియాలో తన స్థానాన్ని కోల్పోతూ వచ్చిన రవీంద్ర జడేజా ఎట్టకేలకు దక్కించుకుని సుస్థిరం చేసుకునే విధంగా కష్టపడుతున్నాడు. కొద్ది నెలల ముందు దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్ పర్యటనలకు జడేజాకు బదులుగా హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకుంది టీమిండియా. ఇంగ్లాండ్ టెస్టుల్లో ఉన్నప్పుడే కాలి కండరం పట్టేయడంతో పాండ్యా టెస్టులకు దూరంకాగా.. మళ్లీ ఆ స్థానంలో జడేజా పొందగలిగాడు.

1
44264

అందివచ్చిన అవకాశాన్ని చక్కగా

పర్యటనలోని మిగతా టెస్టులలో 86 పరుగులతో 7 వికెట్లను దక్కించుకున్న జడేజా ఆ తర్వాత జరిగిన ఆసియా కప్‌లోనూ అదే స్థాయిలో రాణించాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 29పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాల్లోనూ రాణించిన జడేజా సూపర్ 4 స్టేజ్‌లో అఫ్గనిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాపై సాధించిన విజయంలో కీలకపాత్ర పోషించాడు.

కెరీర్‌లోనే మొదటి సెంచరీ తొలి టెస్టులో

చక్కటి ఫామ్‌తో దూసుకుపోతున్న రవీంద్ర జడేజా.. రాజ్‌కోట్ వేదికగా జరుగుతోన్న వెస్టిండీస్‌తో తొలి టెస్టులో 100పరుగులు చేసి కెరీర్‌లోనే మొదటి సెంచరీ నమోదు చేసుకున్నాడు. నిజానికి జడేజాకు సెంచరీ రికార్డు అతని కెరీర్‌లో ఇంతకుముందే రావాల్సింది. మొహాలీ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడి 90పరుగులు సాధించాడు. అంతకుముందొక సారి ఇంగ్లాండ్ గడ్డపై 86పరుగులు చేయగలిగాడు.

పంత్ 92పరుగులు చేసి సెంచరీని మిస్

ప్రస్తుతం జరుగుతోన్న సిరీస్‌లో పృథ్వీ షా అరంగ్రేటంలోనే సెంచరీకి మించిన స్కోరు చేయగా.. పంత్ 92పరుగులు చేసి సెంచరీని మిస్ చేసుకున్నాడు. కొంచెం వెనుకబడిన పూజారా 86పరుగులకే అవుట్ అయ్యాడు. కోహ్లీ మాత్రం 139 పరుగులు సాధించి కెరీర్‌లోనే 24వ సెంచరీ సాధించాడు.

ఇన్నింగ్స్‌ను 649పరుగులకు డిక్లేర్

ఇన్నింగ్స్‌ను 649పరుగులకు డిక్లేర్

ఈ సెంచరీతో కోహ్లీ ఎన్నో రికార్డులను దాటేశాడు. శుక్రవారంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 649పరుగులకు డిక్లేర్ చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (100) నాటౌట్‌గా నిలవగా మొహమ్మద్ షమీ ఒక అంకె స్కోరుకే పరిమితమైయ్యాడు.

Story first published: Friday, October 5, 2018, 15:32 [IST]
Other articles published on Oct 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+