రవీంద్ర జడేజాది ఓ ప్రత్యేక శైలి, ఎవరితోనూ పోల్చలేం: కోచ్

హైదరాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి టీమిండియాలో ఎవరితోనూ పోటీలేదని సౌరాష్ట్ర కోచ్ సీతాన్షు కొటక్ అభిప్రాయపడ్డాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ టెస్టు కోసం గురువారం 13 మందితో కూడిన భారత్ జట్టుని బీసీసీఐ ప్రకటించింది.
ఈ జట్టులో గాయపడిన అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజాకి చోటు లభించింది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు అనంతరం స్పిన్నర్ అశ్విన్ ఎడమవైపు పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం అతడు వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యాడు.

పెర్త్ టెస్టులో అశ్విన్‌కు ప్రత్యామ్నాయంగా
దీంతో అశ్విన్‌కు ప్రత్యామ్నాయంగా రవీంద్ర జడేజాకి జట్టు మేనేజ్‌మెంట్ చోటు కల్పించింది. ఈ నేపథ్యంలో వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ జడేజాకి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నాడా? అని కొటక్‌ని ప్రశ్నించగా "ప్రతి రంగంలోనూ పోటీ ఉంటుంది. అలానే క్రికెట్‌లో కూడా. నేను ఇక్కడ చాహల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ గురించి కామెంట్ చేయదల్చుకోలేదు" అని అన్నాడు.

జడేజాకి ఓ ప్రత్యేక శైలి ఉంది
"కానీ.. జడేజాకి ఓ ప్రత్యేక శైలి ఉంది. అది ఎవరితోనూ పోల్చదగినది కాదు. అలానే అతని అసాధారణ ప్రతిభకి కూడా ఎవరూ పోటీనివ్వలేరు. టీమిండియాకి ఆడే చాలా మంది క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌లో అదే నిబద్ధతతో ఆడరు. రవీంద్ర జడేజా మాత్రం రెండింటిలోనూ ఒకే నిబద్ధతతో ఆడటాన్ని నేను చూశాను" అని కొటక్ తెలిపాడు.

గతేడాదిన్నర్ కాలంగా టెస్టు క్రికెట్‌కే పరిమితం
గతేడాదిన్నర్ కాలంగా మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో అశ్విన్, జడేజాలు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమమై కేవలం టెస్టులకే పరిమితమైన సంగతి తెలిసిందే. గత సోమవారం అడిలైడ్ వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ అశ్విన్ ఆడగా, జడేజా బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఆసీస్ గడ్డపై జడేజాకు ఇది మొదటి సిరిస్
రవీంద్ర జడేజాకు ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియాతో ఇదే మొట్టమొదటి టెస్టు సిరిస్. అంతకముందు ఆస్ట్రేలియాతో జడేజా ఆడిన రెండు టెస్టు సిరిస్‌లు స్వదేశంలోనే ఆడినవే కావడం విశేషం. స్వదేశంలో ఆస్ట్రేలియాతో మొత్తం 8 టెస్టులాడిన జడేజా 2.17 ఎకానమీతో మొత్తం 49 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్లను తీశాడు.

ఆసీస్ పర్యటనకు ముందు రంజీ ట్రోఫీలో జడేజా సెంచరీ
రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో పాటు ఒక మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం అందుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లే ముందు సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ ఆడిన రవీంద్ర జడేజా రైల్వేస్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 226 పరుగులు (178, 48) చేశాడు. ఇక, బంతితోనూ రాణించి 7 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications