Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరుసార్లు ఔట్: చెన్నై టెస్టులో జడేజా మరో ఘనత

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలో జరుగుతున్న చివరి టెస్టు ఐదో రోజున టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 12/0 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజైన మంగళవారం బ్యాటింగ్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు స్కోరు 103 పరుగుల వద్ద అలెస్టర్ కుక్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.

జడేజా బౌలింగ్‌లో 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ అలెస్టర్ కుక్ పెవిలియన్‌కు చేరాడు. జడేజా వేసిన ప్రమాదకరమైన బంతిని కుక్ ఆడటంలో విఫలమై లెగ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చాడు. కుక్ వికెట్ తీసిన నేపథ్యంలో జడేజా ఓ అరుదైన ఘనతను సాధించాడు. ఈ సిరీస్‌లో ఆరుసార్లు జడేజా బౌలింగ్‌లో కుక్ అవుటయ్యాడు.

Ravindra Jadeja dismisses Alastair Cook six times in the series

ఇలా ఒక సిరిస్‌లో అత్యధికంగా ఒక బౌలర్ చేతిలో కుక్ అవుటవడం ఇదే తొలిసారి కావడం విశేషం. కుక్ అవుటైన సందర్భంలో యావరేజి 12.50గా నమోదైంది. ఐదో రోజు ఉదయం సెషన్‌లో 19 ఓవర్ తర్వాత జడేజా చేతికి కోహ్లి బంతి ఇచ్చాడు. ఆ తర్వాత మళ్లీ కోహ్లీ మరోసారి జడేజాకు బంతి ఇచ్చాడు.

ఇంగ్లాండ్‌తో సిరిస్: చెన్నై టెస్టులో నమోదైన రికార్డులివే

రవీంద్ర జడేజా వేసిని 39 ఓవర్ నాలుగో బంతికి కుక్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత జట్టు స్కోరు 111 పరుగుల వద్ద అర్ధసెంచరీ చేసిన జెన్నింగ్స్‌ (54) ను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో 44 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+