పుట్టిన నెలరోజులకి తొలిసారి తన కుమార్తెను చూసుకున్న జడేజా
హైదరాబాద్: నెల రోజుల తర్వాత తన కుమార్తెని చూసిన ఆనందంలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉబ్బితబ్బిబ్బయ్యాడు. జడేజా భార్య జూన్‌లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే పాప పుట్టిన సమయంలో జడేజా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు.
దీంతో తన పాపను చూసుకునే వీలు జడేజాకు కలగలేదు. దాదాపు నెల రోజుల తర్వాత తన పర్యటనలు ముగించుకుని బుధవారం భారత్ వచ్చిన జడేజా నేరుగా ముంబైలోని తన భార్య, కుమార్తె వద్దకు వెళ్లాడు. తొలిసారి తన కుమార్తెని కళ్లారా చూసుకున్నాడు. తన చిట్టితల్లిని చూసిన ఆనందంలో జడేజా ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

తన భార్య రీవా సోలంకీతో కలిసి ఓ కార్యక్రమంలో
అనంతరం బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన భార్య రీవా సోలంకీతో కలిసి జడేజా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి భార్యతో పాటు కుమార్తెని కూడా తీసుకువచ్చాడు. దీంతో ఈ కార్యక్రమంలో వాళ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా జడేజా మీడియాతో మాట్లాడాడు.

అద్భుతమైన ఫీలింగ్
'ఇదో అద్భుతమైన ఫీలింగ్. ఇప్పుడు నేను నా కూతురితో సమయం గడపదలుచుకున్నా. అంతకుమించి ఇప్పుడు నాకేమీ ముఖ్యం కాదు. ఇది నాకెంతో మంచి పరిణామం. ఇంట్లో అంతా చాలా ఆనందంగా ఉన్నాం. ఇదివరకు ఇంటికెళితే చాలా బోర్ కొట్టేది. ఇప్పుడు నాతో ఆడుకోవడానికి బొమ్మ(నిధ్యాన) దొరికింది. ఇక తనతోనే నాకు టైంపాస్' అని చెప్పాడు.

తొలి ప్రాధాన్యం దేశానికే
వాస్తవానికి చాలా మంది క్రికెటర్లు తమ భార్యలు బిడ్డల్ని జన్మనిచ్చే సమయంలో వారి పక్కన ఉండటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటాన్ని గతంలో మనం చాలా సార్లు చూశాం. కానీ జడేజా మాత్రం జట్టుకే తన తొలి ప్రాధాన్యం దేశానికి అంటున్నాడు.

కూతురు కన్నా జట్టు చాలా ముఖ్యం
పాప పుట్టిన తొలినాళ్లలో నా మనసు కొంచెం డైవర్ట్ అయ్యింది. బాగా ఆలోచించాక కూతురు కన్నా జట్టు చాలా ముఖ్యం అనిపించింది. దేశం కోసం ఆడే అవకాశం కొంత మందికే దక్కుంది. అనుకోకుండా వాళ్లలో నేనొకడిని. నా పాప బాగోగులు చూసుకోవడానికి ఇక్కడ చాలా మందే ఉన్నారు. అందుకే ఇంటికి వెళ్లి పాపను చూడటం కన్నా.. జట్టు విజయంతో సహాయపడటానికే ఇష్టపడ్డాను' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications