
హైదరాబాద్: ఐపీఎల్ గురించి అందరిలాగే రవీంద్ర జడేజా సైతం భారీ ఆశలే పెట్టుకున్నాడు. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోయే రవీంద్ర జడేజాకు మహేంద్ర సింగ్ ధోనీ మాటిచ్చాడంట. ఈ సారి జట్టులో జడేజాకు బ్యాటింగ్ చేసే అవకాశాలున్నాయంటూ చెప్పడంతో బ్యాటింగ్ పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించానని అతను పేర్కొన్నాడు.
భారత జట్టులో స్థానం కోసం ఆరాటపడుతోన్న జడేజా బ్యాటింగ్‌ను మెరుగుపరచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇతను ఆఖరు సారిగా భారత జట్టులో 2017 సంవత్సరం భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఆ సిరీస్‌లో సౌరాష్ట్ర స్పిన్నర్ అయిన జడేజా తనదైన శైలిలో బాగానే ఆకట్టుకున్నాడు. భారత జట్టులో ఇప్పటికే పరిమిత ఓవర్లకు ఆడుతున్న మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ స్థానంలోకి రావాలని ఆరాటపడుతున్నాడు.
ఆదివారం సికింద్రాబాద్‌లోని జింఖానా స్టేడియం వేదికగా జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో రవీంద్ర జడేజా అద్భుతంగా ప్రదర్శించాడు. జట్టు స్కోరు 330లో జడేజా ఒక్కడే 113 పరుగులను నమోదు చేశాడు. అయితే ఈ ట్రోఫీలో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఒక్క వికెట్ కూడా అవుట్ చేయలేకపోవడం గమనార్హం.
ఆదివారం మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన జడేజా...'ఈ సారి ఐపీఎల్ సీజన్‌కు బ్యాటింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మహీ భాయ్ చెప్పాడు. ఇది నాకు ప్రేరణగా నిలిచింది. పదకొండు మందిలో ఒకడిగా ఆడేందుకు సిద్ధంగా లేను. జట్టులో నాకు ఓ గుర్తింపు కావాలని కష్టపడుతున్నాను. నేను బౌలింగ్ బాగానే చేస్తున్నాను. కానీ. దాని కంటే ఎక్కువగా బ్యాటింగ్‌నే టార్గెట్ గా కష్టపడుతున్నాను' అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.