భారత క్రికెటర్ పేరు మారిపోయింది: ట్విట్టర్‌లో ఆవేదన

హైదరాబాద్: ప్రతి మనిషీ ఓ గుర్తింపు కోరుకుంటాడు. ఏ బిరుదూ లేకపోయినా ఏదో ఒక పేరుతో సర్ధి పెట్టుకుంటాడు. కానీ, పేరే లేకుండా పోతే ఏం చేసేది. పాపం.. ఇలాంటి చేదు అనుభవమే టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజాకు జరిగింది.
ఇటీవల ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత్-శ్రీలంకల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జడేజా ఆడాడు. ప్రత్యర్థి జట్టు 5 వికెట్లను పడగొట్టాడు. మొత్తంగా భారత్ 1-0తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ప్రేక్షకుల్లో నుంచి ఓ అభిమాని అజయ్ అంటూ పిలవడం మొదలుపెట్టాడు.
దాంతో అతనితో మాట్లాడిన రవీంద్ర జడేజా కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని తానే ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఓ వ్యక్తి నా వద్దకు వచ్చి 'అజయ్ నువ్వు బాగా బౌలింగ్ చేస్తున్నావు. గత మ్యాచ్‌లో నీ బౌలింగ్ ప్రదర్శన అద్భుతం' అని అన్నాడు. గత 9ఏళ్లుగా నేను దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాను. అయినా ఇప్పటికీ ప్రజలు నన్ను సరిగా గుర్తించలేకపోతున్నారు' అని జడేజా పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications