పిచ్‌ను నిందించిన మాజీ క్రికెటర్లపై అశ్విన్ పరోక్ష వ్యాఖ్యలు!

India vs England : Ravichandran Ashwin’s Cryptic Tweets Leave Fans Puzzled || Oneindia Telugu

అహ్మదాబాద్: భారత్, ఇంగ్లండ్ మధ్య రెండు రోజుల్లోనే ముగిసిన డే/నైట్ టెస్ట్‌కు ఆతిథ్యమిచ్చిన మొతెరా స్టేడియం పిచ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. అసలు టెస్ట్ మ్యాచ్‌కు ఇలాంటి వికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలపై రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ఏ మాత్రం అర్థం కానీ భాషలో వరుస ట్వీట్లతో మాజీ క్రికెటర్లపై మండిపడ్డాడు. కోడింగ్ భాషలో ఉన్న అశ్విన్ ట్వీట్స్‌లో ఉన్న అర్థాన్ని అభిమానులు డీకోడ్ చేస్తున్నారు.

భారత విజయాన్ని తక్కువ చేస్తూ, పిచ్‌ను నిందిస్తూ టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్‌, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌లు చేసిన వ్యాఖ్యలను అశ్విన్ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. మార్కెటింగ్ వ్యూహాలు, వస్తువుల అమ్మకాలనే పదాలతో వరుస ట్వీట్లు చేశాడు.

'వివిధ మార్కెటింగ్ వ్యూహాల కారణంగానే ఉత్పత్తులు అమ్ముడవుతాయి. పైగా ఇది అమోదించబడిన పద్దతి. మనం ఇప్పుడు ఆలోచనలను కూడా అమ్ముతున్న యుగంలో జీవిస్తున్నాం. ఆలోచలను అమ్మడం ఔట్‌బౌండ్ మార్కెటింగ్‌కు సరైన ఉదాహరణ. అయితే మనకు అమ్మిన ఆలోచనలను కొనడం అంటే మనకు చెప్పడం లాంటిదేనని నా అభిప్రాయం'అని ట్వీట్ చేశాడు. మరో రెండు ట్వీట్‌లను కూడా ఈ తరహాలోనే రాసుకొచ్చాడు. అయితే ఈ ట్వీట్స్ నేరుగా చదివితే ఎవరికి అర్థం కావడం లేదు. కానీ అశ్విన్ మాజీ క్రికెటర్లను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఓ అభిమాని ఈ ట్వీట్ వెనుకున్న అర్థాన్ని వివరించాడు.

మైకెల్ వాన్ వంటి మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వారి ఆలోచనలను అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని, బ్యాట్స్‌మెన్ విఫలమైతే పిచ్‌ను నిందిస్తున్నారని అశ్విన్ పరోక్షంగా పేర్కొన్నాడని తెలిపాడు. పిచ్ సరైంది కాదని మెజార్టీ ప్రజలను ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారని, వారి అభిప్రాయాలను ఇతరులపై రుద్దేస్తున్నారని ఇంకో ట్వీట్‌లో చెప్పాడని పేర్కొంటున్నారు. ప్రస్తుతం అశ్విన్ చేసిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇలాంటి వికెట్‌పై ఆడితే దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ టెస్ట్‌ల్లో వరుసగా 1000, 800 వికెట్లు సులువుగా తీసేవారని యువరాజ్ సింగ్ ట్వీట్ చేశాడు. 'రెండు రోజుల్లోనే ఫలితం రావడం టెస్ట్ క్రికెట్‌కు అంత మంచిది కాదు. ఈ వికెట్‌పై అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఆడితే వరుసగా 1000, 800 వికెట్లు తీసేవారు. ఏది ఏమైనా అద్భుత ప్రదర్శన కనబర్చిన అక్షర్ పటేల్‌కు 400 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌కు.. 100వ మ్యాచ్ ఆడిన ఇషాంత్‌కు అభినందనలు'అని పేర్కొన్నాడు.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, February 26, 2021, 15:39 [IST]
Other articles published on Feb 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X