కోహ్లీ ప్రవర్తన బాలేదని బీసీసీఐకి ఫిర్యాదు చేసింది రవిచంద్రన్ అశ్వినే!

R Ashwin Complained To BCCI About Virat Kohli’s Attitude Says Reports || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. వర్క్ లోడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, టెస్ట్, వన్డేల్లో కెప్టెన్‌గా కొనసాగుతానని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేసాడు. అయితే కోహ్లీ అనూహ్య నిర్ణయానికి కారణాలు తెలియకపోయినా.. అనేక ఆసక్తికర కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ సీనియర్ ఆటగాడు.. కోహ్లీ ప్రవర్తన బాలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జైషాకు ఫిర్యాదు చేశాడని 'ది టెలిగ్రాఫ్' ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్వినేనని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌పై స్పష్టం చేసింది.

న్యూజిలాండ్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ సందర్బంగా కోహ్లీ- అశ్విన్ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా సీమింగ్ కండిషన్స్‌లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం జట్టుకు చేటు చేసింది. ఈ ఫ్రస్టేషన్ అంతా కోహ్లీ అశ్విన్‌పై చూపించాడని, అతని ప్రవర్తన పట్ల అశ్విన్ విసుగు చెందాడని ఆ కథనంలో పేర్కొన్నారు. అప్పటి నుంచి అశ్విన్, కోహ్లీ మధ్య విభేదాలు ఏర్పాడ్డాయని, డ్రెస్సింగ్ రూమ్ కూడా రెండుగా చీలిపోయిందని రాసుకొచ్చారు. ఆ కారణంగానే ఇంగ్లండ్ పర్యటనలో అశ్విన్‌ను కోహ్లీ దూరం పెట్టాడని, కోహ్లీ ప్రవర్తనతో విసుగుచెందిన అశ్విన్ బీసీసీఐ ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. దాంతో బీసీసీఐ పెద్దలు కోహ్లీపై ఆగ్రహంగా ఉన్నారని, ఇది పసిగట్టిన కోహ్లీ ముందుగానే తన నిర్ణయాన్ని ప్రకటించాడని ఇటీవల ఓ బీసీసీఐ అధికారి కూడా పేర్కొన్నాడు.

బీసీసీఐకి మేలు..

బీసీసీఐకి మేలు..

కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పి కోహ్లీ.. బీసీసీఐ పనిని సులువు చేశాడని పేర్కొంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి తర్వాత కోహ్లీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని, సహచర ఆటగాళ్లు, కోచ్‌ల పట్ల అతని వైఖరి ఇబ్బందిగా మారిందని ఓ సీనియర్ ప్లేయర్ బీసీసీఐ సెక్రటరీ జైషా దృషికి తీసుకొచ్చాడని, దాంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయన రంగంలోకి దిగాడని ఓ బీసీసీఐ అధికారి తమకు తెలిపినట్లు టెలిగ్రాఫ్ పేర్కొంది. ఈ పరిణామాలను పసిగట్టిన కోహ్లీ ముందుగానే తన నిర్ణయాన్ని ప్రకటించాడని తెలిపింది.

కోహ్లీ అనుచిత ప్రవర్తన..

కోహ్లీ అనుచిత ప్రవర్తన..

‘కోహ్లీ సహనం కోల్పోతున్నాడు. కొంతమంది సీనియర్ ప్లేయర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించి తన గౌరవాన్ని కూడా తగ్గించుకున్నాడు. అతను ఏ మాత్రం స్పూర్తిదాయకమైన సారథి కాదు. ఆటగాళ్ల నుంచి మళ్లీ అతను గౌరవాన్ని పొందలేడు. అతనితో మాట్లాడే విషయంలో కొందరు హద్దులు ధాటాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. బ్యాటింగ్ వైఫల్యం కోహ్లీ మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పెద్ద ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులు అయింది. ఆ ఫ్రస్టేషన్‌లో అతను కోచ్‌లతో పాటు ఆటగాళ్లపై అరుస్తున్నాడు. నెట్ సెషన్‌లో ఓ కోచ్ అతనికి సలహా ఇచ్చే ప్రయత్నం చేయగా.. గట్టిగా మందలించాడు. అనవసర సలహాలతో తనను అయోమయానికి గురి చేయవద్దన్నాడు. వరుస వైఫల్యాలను అధిగమించడంలో విఫలమవుతున్న కోహ్లీ.. ఆ ఫ్రస్టేషన్‌తో కోపాద్రిక్తుడవుతున్నాడు.'అని అశ్విన్.. జైషాకు లేఖ రాసాడని సదరు అధికారి పేర్కొన్నాడు.

అందుకే ధోనీ మెంటార్‌గా..

అందుకే ధోనీ మెంటార్‌గా..

దాంతో కోహ్లీపై ఉన్న ఒత్తిడిని తగ్గించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగిందని, ఈ క్రమంలోనే అతన్ని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు ఇవ్వాలనుకుందని చెప్పాడు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మెగా టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీని మెంటార్‌గా ఎంపిక చేసిందన్నాడు. గేమ్ ప్లాన్ ధోనీ చూసుకుంటే.. కోహ్లీ ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్చగా బ్యాటింగ్ చేయగలడని బీసీసీఐ భావించిందని చెప్పుకొచ్చాడు.

‘రోహిత్ శర్మ చాలా కూల్‌గా ఉంటాడు. అజింక్యా రహానై సైతం ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్‌‌గా సత్తా చాటాడు. రోహిత్‌ను ఓ అన్నలా యువ ఆటగాళ్లు ట్రీట్ చేస్తారు. కోచింగ్ డిపార్ట్‌మెంట్‌లో వచ్చే మార్పులతో కోహ్లీ అధికారం తగ్గించడం ఖాయం. విరాట్ పవర్స్ మొత్తం క్షీణిస్తున్నాయి. ఇక అతని ప్రతీ మూమెంట్ ప్రశ్నార్థకంగా మారుతుంది. కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అనడంలో సందేహం లేదు. కానీ అతని కెప్టెన్సీ బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందనేది వాస్తవం.'అని సదరు అధికారి చెప్పుకొచ్చాడు.

వన్డే కెప్టెన్సీ కూడా..

వన్డే కెప్టెన్సీ కూడా..

కోహ్లీ టీ20 కెప్టెన్సీ మాత్రమే వదులు కోవడంతో రోహిత్ శర్మకు ఆ ఒక్క ఫార్మాట్ సారథ్య బాధ్యతలు ఇవ్వాలా? లేక పరిమిత ఓవర్ల కెప్టెన్సీ ఇవ్వాలా? అనే విషయం బీసీసీఐ తేల్చుకోలేకపోతుంది. అయితే టీ20 ప్రపంచకప్‌ గెలవకపోతే మాత్రం కోహ్లీ వన్డే ఫార్మాట్‌ కెప్టెన్సీ బాధ్యతలు కూడా తప్పుకోవాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇక ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ రోహిత్ సారథ్యంలోని భారత జట్టు గెలిచినా.. వన్డే సారథ్య బాధ్యతలు కూడా అతనికివ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 28, 2021, 23:12 [IST]
Other articles published on Sep 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X