Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నవ్వు ఆపుకోలేరు: కోహ్లీతో 'లగాన్' వీడియోలో అశ్విన్

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చిన టీమిండియా ఆఫ్ స్నిన్నర్ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకు ( టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకు)ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

ఇండోర్‌లో జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో 59 పరుగులకు 7 వికెట్లు తీసుకోవడంతో పాటు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టెస్టు సిరిస్‌లో ఎన్నో రికార్డులను అశ్విన్ బద్దలు కొట్టాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న పిన్నవయస్కుడిగా కూడా చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Ravichandran Ashwin and Virat Kohli part of a spoof video of Lagaan

అనిల్ కుంబ్లే తర్వాత టెస్టుల్లో 21 సార్లు ఐదు వికెట్లను తీసుకున్న అతి కొద్ది మంది బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. 2001లో హార్భజన్ సింగ్ తర్వాత ఒకే సిరిస్‌లో రెండు సార్లు పదేసి వికెట్లు తీసుకున్న ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు. 15 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో భజ్జీ ఈ ఘనతను సాధించాడు.

గత ఎనిమిది టెస్టు మ్యాచ్‌ల్లో అశ్విన్ ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డులను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో అందుకున్న మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు వరుసగా నాల్గవది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ సిరిస్ అనంతరం అశ్విన్ సామాజికి మాధ్యమాల్లో హీరోగా మారాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంతో సోషల్ మీడియాలో 'లగాన్ వీడియో' పేరిట ఒకటి హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను తన ఫేస్ బుక్ పేజ్‌లో పోస్టు చేసిన అశ్విన్ దీనిని చూసి ఎక్కడ నవ్వడం ఆపాలో కూడా తెలియడం లేదని పేర్కొన్నాడు.

ఈ వీడియోలో లగాన్ సినిమాలోని భువన్ పాత్రలో కోహ్లీని కనిపించగా, కచ్రా (అవిటి స్పిన్నర్) పాత్రలో అశ్విన్‌ను చూపించారు. అలాగే ఈ వీడియోలో కీపర్‌గా సాహా, కేన్ విలియమ్సన్ వంటి న్యూజిలాండ్ ఆటగాళ్లు కొందరు కనిపిస్తారు. వీరితోపాటు మాజీ ఐసీసీ చీఫ్ శ్రీనివాసన్ కూడా కనిపించడం విశేషం.

ఇక బాలీవుడ్‌లో 2001లో విడుదలై లగాన్ సినిమా రికార్డుల పరంగా చరిత్రను తిరగరాసింది. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు అశుతోష్ గోవారికర్ రూపొందించారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా కూడా క్రికెట్ నేపథ్యంలోనిది కావడం విశేషం.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+