కోహ్లీకి ఊరట: సీఏ ఎంపిక చేసిన టెస్టు జట్టుకు కెప్టెన్
హైదరాబాద్: కోహ్లీ ఊరట కలిగించే విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. గురువారం ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో కోహ్లీకి చోటు లభించని సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ ప్రకటించిన టెస్టుతో పోలిస్తే క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఆరు మార్పులు చోటు చేసుకున్నాయి. ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టులో ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్, ప్రస్తుతం టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న స్టీవ్ స్మిత్‌కు 12వ స్ధానం లభించిన సంగతి తెలిసిందే.
దీంతో శుక్రవారం క్రికెట్ ఆస్ట్రేలియా టెస్టు టీమ్ ఆఫ్ ద ఇయర్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్‌లో ఉంచింది. ఇందులో భారత్ తరుపు నుంచి కెప్టెన్ కోహ్లీతో పాటు ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌లకు మాత్రమే చోటు లభించింది. ఇక ఐసీసీ వార్షిక అవార్డుల్లో అశ్విన్ పంట పడింది.
ప్లేయర్‌గా ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ప్రతిష్ఠాత్మక సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌నూ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు చోటు దక్కక పోవడం విశేషం.
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే:

అజహర్ అలీ (పాకిస్థాన్)
పాకిస్థాన్ ఓపెనర్. 2016లో 10 టెస్టులాడిన అజహర్ అలీ 950 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. అక్టోబర్‌లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టులో 302 నాటౌట్ అత్యధిక స్కోరుని నమోదు చేశాడు.

జో రూట్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్. ఈ ఏడాది 17 టెస్టులాడిన జో రూట్ 1,477 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై నమోదు చేసిన 254 పరుగులు అత్యధిక స్కోరుగా ఉంది.

స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
స్టీవ్ స్మిత్‌కు ఈ ఏడాది అంతగా కలిసిరాలేదు. 10 టెస్టులాడిన స్టీవ్ స్మిత్ మొత్తం 914 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. 60.93 యావరేజితో ఈ ఏడాది టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు.

విరాట్ కోహ్లీ (టీమిండియా టెస్టు కెప్టెన్)
క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ విరాట్ కోహ్లీని 'స్టార్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2016'గా అభివర్ణించింది. 12 టెస్టులాడిన కోహ్లీ 75.93 యావరేజితో 1215 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ నాలుగింటిలో రెండు డబుల్ సెంచరీలు ఉండటం విశేషం.

బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)
12 టెస్టులాడిన ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ 904 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఈ రెండింటిలో ఒక డబుల్ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక బౌలింగ్‌లో 33 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనతో ఐదో స్ధానంలో నిలిచాడు.

బెయిర్ స్టో (ఇంగ్లాండ్)
17 టెస్టులాడిన బెయిర్ స్టో 1,470 పరుగులు చేశాడు. 2016లో పరుగుల వరద పారించాడు. 58.80 యావరేజితో మూడు సెంచరీలు, 8 అర్ధసెంచరీలను నమోదు చేశాడు.

డికాక్ (దక్షిణాఫ్రికా వికెట్ కీపర్)
మూడు ఫార్మెట్లలో కూడా ఈ ఏడాది అద్భుతంగా రాణించిన అత్యుత్తమ వికెట్ కీపర్లలో డికాక్ ఒకడు. 23 ఏళ్ల డికాక్ ఈ ఏడాది 7 టెస్టులాడి 589 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. 28 మందిని క్యాచ్‌ల రూపంలో పెవిలియన్‌కు పంపాడు.

రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
ఐసీసీ వార్షిక అవార్డుల్లో అశ్విన్ పంట పడింది. ప్లేయర్‌గా ఆఫ్ ది ఇయర్‌గా నిలిచి ప్రతిష్ఠాత్మక సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌నూ సొంతం చేసుకున్నాడు. 12 టెస్టుల్లో 72 వికెట్లు తీసి పలు రికార్డును నమోదు చేశాడు. అందులో మూడు సార్లు 10 వికెట్లను తీసి టెస్టుల్లో చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది 12 టెస్టులాడిన అశ్విన్ 612 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

రంగన హెర్నాత్ (శ్రీలంక)
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో రంగన హెర్నాత్ ఒంటి చేత్తో శ్రీలంకకు విజయాలను అందించాడు. ఈ ఏడాది 8 టెస్టు లాడిన రంగన హెర్నాత్ 54 వికెట్లు తీశాడు. 54 వికెట్లలో 19 వికెట్లు జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల్లోనే పడగొట్టడం విశేషం.

మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 7 టెస్టులాడిన మిచెల్ స్టార్క్ 45 వికెట్లు తీసుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనే రాణించే గలిగే సత్తా ఉందని చూపాడు.

రబడ (దక్షిణాఫ్రికా)
దక్షిణాఫ్రికాకు చెందిన ఈ యువ బౌలర్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. 21 ఏళ్ల ఈ బౌలర్ 8 టెస్టులాడి 42 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications