న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ తెచ్చిన తంట!: ఎక్కడ ఆడితే అక్కడే ఓటేయనివ్వండి!: మోడీకి ట్వీట్టర్‌లో అశ్విన్

Ravichandran Ashwin Tweets Request To PM Modi In IPL Season

హైదరాబాద్: ఐపీఎల్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడుతుండటంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేశాడు. మార్చి 23న ఐపీఎల్ 2109 సీజన్ ప్రారంభం కావడంతో క్రికెటర్లంతా ఈ క్యాష్ రిచ్ టోర్నీలో బిజీ బిజీగా ఉన్నారు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఆడే ఆటగాళ్లు భారత్‌లోని అనేక నగరాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. తాజా ఐపీఎల్ సీజన్‌లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి. భారతదేశం అంతటా వివిధ రాష్ట్రాల్లో మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ తన సొంత ఊరిలోనే ఓటు వేయాలి. అయితే, ఎన్నికలు జరిగే సమయంలో ఆ క్రికెటర్ తన రాష్ట్రంలో ఉండకపోవచ్చు. దీంతో తాము ఓటు వేసే అవకాశం కోల్పోతామని కింగ్స్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్... ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చాడు.

దీంతో తమకు దేశంలో ఎక్కడైనా ఓటు వేసే అవకాశం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్టర్‌లో విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని పిలుపునిచ్చాడు. అదే సమయంలో తమకు ఈ వెసులుబాటు కల్పించాల్సిందిగా ప్రధానిని కోరాడు.

Story first published: Monday, March 25, 2019, 19:00 [IST]
Other articles published on Mar 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X