Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravichandran Ashwin: అత‌డిని ఔట్ చేయ‌డానికి 6 నెల‌లు రీసెర్చ్ చేశా

Ravichandran Ashwin tells how he was prepared to get Steve Smith out
R Ashwin - “I Made Him My Obsession For Six Months' | Oneindia Telugu

గ‌త ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఆ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ తాజాగా వెల్ల‌డించాడు. ఆ ప‌ర్య‌ట‌న‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవెన్ స్మిత్‌ను ఔట్ చేసేందుకు తాను ఎలా ప్రిపేర్ అయ్యాడో చెప్పాడు. ఒక్క స్మిత్ మాత్ర‌మే కాకుండా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఆ జ‌ట్టు కెప్టెన్ జోరూట్‌, మ‌రో ఆస్ట్రేలియా ప్లేయ‌ర్ మార్న‌స్ ల‌బూషేన్‌ను ఔట్ చేయడానికి తాను ఏ విధంగా సంసిద్ధం అయ్యాడో ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అశ్విన్ వెల్ల‌డించాడు.

ముఖ్యంగా స్టీవెన్ స్మిత్‌ను ఔట్ చేయ‌డానికి తాను ప్ర‌త్యేకంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్న‌ట్టు అశ్విన్ తెలిపాడు. కేవ‌లం రెండు, మూడు వారాలు కాకుండా 6 నెల‌ల‌పాటు స్మిత్‌పై రీసెర్చ్ చేసిన‌ట్టు చెప్పుకొచ్చాడు. స్మిత్ అంత‌కు ముందు బ్యాటింగ్‌కు సంబంధించిన వీడియోల‌ను చూసిన‌ట్లు వివ‌రించాడు. స్మిత్‌కు సంబంధించిన విభిన్న మ్యాచ్‌ల వీడియోల‌ను చూసిన‌ట్లు అశ్విన్ తెలిపాడు. అలా రోజంతా స్మిత్ వీడియోలు చూసేవాడిన‌ని చెప్పాడు.

అందులో స్మిత్ బ్యాటింగ్ శైలిని, బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు అత‌ని ఆలోచ‌న విధానాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్న‌ట్లు వివ‌రించాడు. స్మిత్ ప్ర‌తి బంతిని ఏ విధంగా చూస్తాడో అర్థం చేసుకున్న‌ట్టు తెలిపాడు. స్మిత్‌తోపాటు మ‌రో ఆస్ట్రేలియా ఆటగాడైన లాబుస్‌షేన్‌ను కూడా అదే విధంగా ప‌రిశీలించిన‌ట్టు చెప్పాడు. స్మిత్ బ్యాటింగ్ చేసే స‌మ‌యంలో త‌న చేతుల‌ను ఎలా ఉప‌యోగిస్తాడో అర్థం చేసుకున్న‌ట్లు వివ‌రించాడు.

స్మిత్ బ్యాటింగ్ ఎక్కువ‌గా అత‌ని చేతుల క‌ద‌లిక‌ల‌పై ఆధార‌ప‌డి ఉంటుందని అర్ధం చేసుకోని, దాన్ని డిస్ట‌ర్బ్ చేస్తే పై చేయి సాధించ‌వ‌చ్చని భావించిన‌ట్టు చెప్పాడు. దానికి త‌గ్గ‌ట్టే వ్యూహాలు సిద్ధం చేసుకోని వైవిధ్య‌మైన బంతుల‌తో స్మిత్‌కు బౌలింగ్ చేసిన ఔట్ చేసిన‌ట్టు అశ్విన్ తెలిపాడు. అలాగే విభిన్న వేగంతో కూడిన బంతులు వేసిన‌ట్టు చెప్పాడు. అదే విధంగా ఆస్ట్రేలియాకు చెందిన మ‌రో స్టార్ బ్యాట‌ర్ మార్న‌స్ ల‌బూషేన్‌కు కూడా ఇలాగే వ్యూహాలు సిద్ధం చేసి ఔట్ చేసిన‌ట్లు తెలిపాడు.

కాగా ఆ సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకుని సొంత గ‌డ్డ‌పైనే ఆస్ట్రేలియాకు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సిరీస్ విజ‌యంలో స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించాడు. ముఖ్యంగా త‌న వ్యూహాల‌తో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట‌ర్ స్టీవెన్ స్మిత్‌ను ఎక్కువ సార్లు తక్కువ స్కోర్‌కే ఔట్ చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు త‌న కెరీర్‌లో 81 టెస్టులు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 427 వికెట్లు ప‌డ‌గొట్టాడు. భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక వికెట్లు తీసిన మూడో బౌల‌ర్‌గా నిలిచాడు.

Story first published: Wednesday, December 22, 2021, 15:54 [IST]
Other articles published on Dec 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+