
రెచ్చిపోయిన ఖవాజా, గ్రీన్
ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 150 పరుగులపైగా స్కోరు చేయగా.. యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (114) కూడా శతకంతో ఆకట్టుకున్నాడు. ఈ జోడీ ఏకంగా 208 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.
ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఎన్ని బౌలింగ్ మార్పులు చేసినా ఫలితం లేకపోయింది. చివరకు ఎప్పట్లాగే సీనియర్ బౌలర్ అశ్విన్‌నే రోహిత్ నమ్ముకోవాల్సి వచ్చింది. తనపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన అశ్విన్.. ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.

గ్రీన్‌కు రెడ్ సిగ్నల్..
అశ్విన్ వేసిన 131 ఓవర్ రెండో బంతికి కామెరూన్ గ్రీన్ అవుటయ్యాడు. అప్పటి వరకు స్వీప్ షాట్ ఆడని గ్రీన్.. ఆ బంతిని స్వీప్ చేయడానికి ప్రయత్నించాడు. అశ్విన్ కూడా చాలా తెలివిగా గ్రీన్‌కు చికాకు కలిగించాడు. దీంతో స్వీప్ ఆడేందుకు ప్రయత్నించిన గ్రీన్.. విఫలమయ్యాడు.
ఈ క్రమంలో అతని గ్లవ్స్‌ను ముద్దాడుతూ లెగ్ సైడ్ వెనక్కు వచ్చిన బంతిని కీపర్ కేఎస్ భరత్ చక్కగా అందుకున్నాడు. బంతి స్టెప్ పడగానే లెగ్ సైడ్ జరిగిన భరత్.. గ్రీన్‌కు మరో అవకాశం ఇవ్వకుండా చక్కటి క్యాచ్ పట్టేశాడు. దీంతో గ్రీన్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఆ వెంటనే క్యారీ..
అదే ఓవర్లో మరో ప్రమాదకర బ్యాటర్ అలెక్స్ క్యారీ (0) కూడా అవుటయ్యాడు. అతను ఆఫ్ ది మార్క్ సింగిల్ కూడా తీసే అవకాశం అశ్విన్ ఇవ్వలేదు. టైట్ డెలివరీలతో అతనికి చికాకు కలిగించాడు. అలా రెండు బంతులు చాాలా టైట్‌గా రావడంతో క్యారీ తడబడ్డాడు. తను ఒత్తిడి నుంచి బయట పడేందుకు భారీ షాట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలోనే అశ్విన్ వేసిన బంతిని లెగ్ సైడ్ భారీ షాట్ కొట్టేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో బ్యాటు చివర్లో తగిలిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని అక్షర్ పటేల్ చాలా సులభంగా పట్టేయడంతో క్యారీ కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓవర్లో మిచెల్ స్టార్క్ (6) కూడా అశ్విన్ వలలో పడ్డాడు. ఇది చూసిన నిపుణులు అశ్విన్ బౌలింగ్ బుర్రను తెగ మెచ్చుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా అశ్విన్ ఆటతీరుకు ఫిదా అయిపోయారు.


Click it and Unblock the Notifications












