సొంతగడ్డపై కపిల్ దేవ్ రికార్డుని అధిగమించిన అశ్విన్
హైదరాబాద్: ఆస్ట్రేలియాతో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ 37 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డుని టెస్టుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ అధిగమించాడు.
స్వదేశంలో హోం సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్టు రెండోరోజైన శుక్రవారం మార్నింగ్ సెషన్‌లో 61 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మిచెల్ స్టార్క్‌ను అవుట్ చేయడంతో అశ్విన్ ఈ ఘనతను సాధించాడు.

13 టెస్టుల్లో 63 వికెట్లు తీసి కపిల్ దేవ్
1979-80 సీజన్‌లో లెజెండరీ ఇండియన్ పేసర్ కపిల్‌దేవ్ 13 టెస్టుల్లో 63 వికెట్లు తీసి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పూణె టెస్టులో మిచెల్ స్టార్క్ వికెట్ తీయడంతో సొంతగడ్డపై ప్రస్తుత సీజన్‌లో తాను ఆడుతున్న టెస్టులో 64వ వికెట్‌ను తీసి కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ అధిగమించాడు.

టీమిండియా విజయాల్లో అశ్విన్ కీలకపాత్ర
ఈ టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అశ్విన్ 24.55 యావరేజితో 61 వికెట్లు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో టీమిండియా వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకోవడంలో అశ్విన్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

అత్యంత వేగంగా 250 వికెట్లు రికార్డుని సైతం
ఇటీవలే టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసిన డెన్నిస్ లిల్లీ రికార్డుని కూడా అశ్విన్ అధిగమించిన సంగతి తెలిసిందే. 2012-13 సీజన్‌లోనే 10 టెస్టుల్లో 61 వికెట్లు తీసిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన సత్తా నిరూపించుకున్నాడు.

ఈ సీజన్‌లో అదరగొడుతున్న అశ్విన్
2016-17 సీజన్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 27 వికెట్లు, ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల్లో 28 వికెట్లు, బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆరు వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications