Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా బాజ్‌బాల్ ఆడితే.. టీంలో నలుగురు ప్లేయర్లు అవుట్!

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన సిరీస్ కంటే కూడా.. క్రికెట్ ప్రేమికులను ఈ ఏడాది జరిగిన యాషెస్ సిరీస్ బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఇది చూసిన టీమిండియా ఫ్యాన్స్‌కు.. భారత్ కూడా ఇలా బాజ్‌బాల్ ఆడితే బాగుంటుందని అనిపించింది.

విండీస్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు కొంత ఎగ్రెసివ్‌గా ఆడారు కూడా. దీంతో భారత్ కూడా బాజ్‌బాల్ విధానాన్ని అలవాటు చేసుకుంటోదని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ భారత్‌లో అది కుదరదని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పష్టం చేశాడు. ఈ తరహా క్రికెట్ ఆడితే.. భారత జట్టులో కనీసం నలుగురు ప్లేయర్లను పక్కన పెట్టేయాల్సి వస్తుందన్నాడు.

Ravichandran Ashwin

'ఈ ట్రాన్సిషన్ దశలో భారత జట్టు కూడా బాజ్‌బాల్ ఆడుతుందని అనుకుందాం. ఇంగ్లండ్ కుర్రాడు హ్యారీ బ్రూక్ చేసినట్లే.. మన బ్యాటర్లలో ఒకరు కూడా కనిపించిన ప్రతి బంతినీ ఆడేందుకు ప్రయత్నించాడని అనుకుందాం. ఈ క్రమంలో తక్కువ స్కోర్లకే అవుటైపోతున్నాడు. దీంతో మనం రెండు మ్యాచులు ఓడిపోయాం. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి' అని అశ్విన్ అడిగాడు.

'ఇలా రెండు టెస్టులో ఓడినా కూడా బాజ్‌బాల్ విధానానికి, ఆటగాళ్లకు మద్దతు ఉంటుందా? మనం కచ్చితంగా టీం నుంచి కనీసం నలుగురు ప్లేయర్లను పక్కన పెట్టేస్తాం. అది మన కల్చర్. ఇది ఎప్పటి నుంచో ఇలాగే కొనసాగుతోంది. కాబట్టి మనం వేరే వాళ్లు సక్సెస్ అయ్యారు కదా.. అని వాళ్ల స్టైల్‌ను కాపీ కొట్టలేం' అని అశ్విన్ వివరించాడు.

అంతేకాదు ఇంగ్లండ్ టీం మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు, ఫ్యాన్స్ అందరి మద్దతు ఉంది కాబట్టే.. ఆ టీం బాజ్‌బాల్ ఆడగలుగుతోందని స్పష్టం చేశాడీ దిగ్గజ స్పిన్నర్. 'వాళ్లకు ఈ స్టైల్ పని చేస్తుందంటే.. వారికి మేనేజ్‌మెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. సెలెక్టర్లు కూడా ఆ ప్లేయర్లకు అండగా ఉన్నారు. గట్టిగా మాట్లాడితే.. టెస్టులు చూసే వాళ్ల ఫ్యాన్స్ కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు. అది మన వల్ల కాదు' అని తేల్చిచెప్పాడు.

Story first published: Wednesday, August 2, 2023, 16:23 [IST]
Other articles published on Aug 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+