న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2021: వైద్యుల నిస్సహాయత నన్ను చంపేస్తోంది: అశ్విన్‌

Ravichandran Ashwin says Helplessness written all over his face is killing me

చెన్నై: కరోనా వైరస్ బాధితులను కాపాడే క్రమంలో వైద్యుల ముఖాల్లో కనిపిస్తున్న నిస్సహాయత తనను చంపేస్తోందని టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ అంటున్నాడు. దేశవ్యాప్తంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయని యాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడటంతో మధ్యలోనే టోర్నీని వీడాడు. చెన్నైకి వచ్చి తన కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకున్నాడు.

IPL 2021 Postponed: కరోనా ఎవరినీ లెక్కచేయదు.. దానికి ఇష్టమైన వ్యక్తులు అంటూ ఉండరు! స్టెయిన్‌ పంచ్!IPL 2021 Postponed: కరోనా ఎవరినీ లెక్కచేయదు.. దానికి ఇష్టమైన వ్యక్తులు అంటూ ఉండరు! స్టెయిన్‌ పంచ్!

ప్రస్తుతం రవిచంద్రన్‌ అశ్విన్‌ కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకుంటున్నారు. మహమ్మారి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెలుసు కాబట్టేకరోనాపై చురుగ్గా సామాజిక మాధ్యమాల్లో తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ప్రాణవాయువు సరఫరా లేకపోవడంతో ఒక వైద్యుడు సహా 12 మంది మృతిచెందారు. ఘటనకు సంబంధించి ఓ విలేకరి ఆ వైద్యశాల డైరెక్టర్‌ ఎస్‌సీఎల్‌ గుప్తాను ఇంటర్వ్యూ చేశారు. 'నేనేం మాట్లాడలేకపోతున్నాను' అంటూ ఆ వైద్యుడు కన్నీటి పర్యంతం అయ్యారు.

ఎస్‌సీఎల్‌ గుప్తా ఇంటర్వ్యూ చూసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ చలించిపోయాడు. గుప్తా ముఖంలో కనిపించిన నిస్సహాయత తనను చంపేసిందని అశ్విన్‌ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అశ్విన్‌ కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో.. అతడు రెండో లెగ్ మ్యాచులకు అందుబాటులో ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలోనే టోర్నీలో కావున కేసులు అధికం అవ్వడంతో బీసీసీఐ ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేసింది.

కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబానికి అండగా ఉండాలనే కారణంతో ఆర్ అశ్విన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అశ్విన్ కుటుంబం చెన్నైలో నివసిస్తోన్న విషయం తెలిసిందే. చెన్నై సహా తమిళనాడు వ్యాప్తంగా వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంతకుముందు పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడిన యాష్.. గతేడాది నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు. అశ్విన్ సుదీర్ఘ కాలం చెన్నైకి ఆడిన విషయం తెలిసిందే. యాష్ ఐపీఎల్ టోర్నీలో 159 మ్యాచుల్లో 139 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Wednesday, May 5, 2021, 13:41 [IST]
Other articles published on May 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X