Ravichandran Ashwin: షేన్ వార్న్ చెప్పిన ఫిలాసిఫితోనే ఆశ కోల్పోలేదు

T20 World Cup Semifinals లో India ఉండేది... Ashwin తెలిసొచ్చేలా చేశాడు || Oneindia Telugu

దుబాయ్: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ చెప్పిన ఫిలాసఫీతోనే జీవితంపై ఆశ కోల్పోలేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. కెరీర్‌లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా ఉండాలని వార్న్ చెప్పిన మాటలు ఎప్పటికీ తనకు ప్రేరణగా నిలుస్తాయన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అవకాశం అందుకోని అశ్విన్.. అఫ్గాన్‌‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగి దుమ్మురేపాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత్‌ జట్టు తరఫున టీ20 ఫార్మాట్‌ ఆడిన రవిచంద్రన్‌ అశ్విన్‌ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు.

టీ20 ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు తనను పక్కన పెట్టడం ఎంత పొరపాటో టీమిండియా మేనేజ్‌మెంట్‌కు తెలిసొచ్చేలా బౌలింగ్‌ చేశాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ నాలుగు ఓవర్లు వేసి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా గుల్బాదిన్ నైబ్, జాద్రాన్‌ వంటి కీలకమైన వికెట్లనూ పడగొట్టాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ నేపథ్యంలో గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న అశ్విన్‌ తన రీఎంట్రీపై స్పందించాడు.

ఓపికగా ఉండాలి..

ఓపికగా ఉండాలి..

'జీవితం ఓ చక్రంలాంటిదని నేను నమ్ముతుంటా. కొందరికి చిన్నది కావచ్చు. మరికొందరికి పెద్దది కావచ్చు. చీకటి దశను దాటే వరకు ఓపికగా నిరీక్షించాలి. గత రెండేళ్లుగా జీవిత గమనం ఎలా ఉంటుందో గమనిస్తూ వచ్చాను. నేను మంచి ఫామ్‌లో ఉన్నా.. లేకపోయినా నాకంటూ కొన్ని నిబంధనలను పెట్టుకున్నా. సుదీర్ఘకాలం నిశ్చలంగా గడపేందుకు ప్రయత్నించా. వైఫల్యాలు ఎందుకు వచ్చాయనే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. విజయవంతమైన సమయాల్లో వినయంగా ఉండాలని చాలా మంది చెప్తుంటారు. అయితే దానిని నేను గట్టిగా స్వీకరించి ఆచరించాను.'' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

వైఫల్యాలు అధికంగా ఉండాలి..

వైఫల్యాలు అధికంగా ఉండాలి..

కెరీర్‌లో విజయం కంటే వైఫల్యాలు అధికంగా ఉండాలని షేన్‌వార్న్‌ చెప్పిన ఫిలాసఫీని తాను బాగో ఫాలో అవుతానని చెప్పాడు. సక్సెస్‌ గురించి షేన్‌ వార్న్‌ ఓ సందర్భంలో చెప్పిన మాటలను ఈ వెటరన్ స్పిన్నర్ గుర్తు చేసుకున్నాడు. 'నీకు సక్సెస్‌ రేట్‌ 33 శాతమే. సచిన్‌కు కూడా తన కెరీర్‌లో కొంత సమయం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. వారే అలా ఉంటే.. ఇక నేనెవరిని? నేనేమీ అతీతుడిని కాదు కదా.. స్ఫూర్తిని కోల్పోవడం, ఆశలను వదులుకోవడం చాలా సులువు. అవన్నీ వదిలేసి ఇతరులపై ఫిర్యాదు చేయడంపైనే కొందరు ఉంటారు. నేనైతే అలా చేయలేను.

ఆ క్షణమే నిర్ణయించుకున్నా..

ఆ క్షణమే నిర్ణయించుకున్నా..

తన తప్పు లేకుండానే బయటకెళ్లి పోతే పరిష్కారం ఏంటి? అత్యంత సులభమైన పద్ధతి ఏంటంటే.. వృత్తిపరంగా ముందుకెళ్లడమే. సన్నద్ధతను కొనసాగించడం, గట్టిగా కృషి చేయడం, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఏదో ఒక రోజు నీ తలుపు తప్పక తడుతుంది. 2017లో ఎప్పుడైతే టీ20 జట్టులో చోటు కోల్పోయానో.. అప్పుడే నన్ను నేను టీ20 ఫార్మాట్‌ బౌలర్‌గా తీర్చిదిద్దుకున్నా.. జీవిత చక్రం ఎప్పటికీ ఆగదు'అని అశ్విన్‌ చెప్పుకొచ్చాడు.

చెలరేగిన భారత్..

చెలరేగిన భారత్..

అఫ్గాన్‌‌‌తో మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్.. 66 పరుగుల భారీ తేడాతో అఫ్గాన్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మళ్లీ టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రోహిత్‌ శర్మ (47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), కేఎల్‌ రాహుల్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 69) చెలరేగారు. రిషభ్‌ పంత్‌ (13 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 27 నాటౌట్‌), హార్దిక్‌ పాండ్యా (13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. తర్వాత అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 144 పరుగులే చేసి ఓడింది. కరీమ్‌ జనత్‌ (22 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42), కెప్టెన్‌ నబీ (32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) మెరుగ్గా ఆడారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, November 5, 2021, 9:51 [IST]
Other articles published on Nov 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X